twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ante Sundaraniki Collections: 11వ రోజు రానా సినిమాకు దగ్గరగానే వసూళ్లు.. అయినా టార్గెట్ పెద్దదే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. చివరిగా శ్యాం సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా 'అంటే.. సుందరానికీ!' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి

    అంటే.. సుందరానికీ

    అంటే.. సుందరానికీ

    నేచురల్ స్టార్ నాని -మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ జంటగా నటించిన తాజా చిత్రం 'అంటే.. సుందరానికీ!'. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా తదితరులు కీలక పాత్రలలో నటించారు.

    30 కోట్ల బిజినెస్

    30 కోట్ల బిజినెస్

    ఇక తెలుగు హీరో- మళయాళ హీరోయిన్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'అంటే.. సుందరానికీ!' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తం కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక నాని మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

    11వ రోజు ఎంతంటే?

    11వ రోజు ఎంతంటే?

    'అంటే.. సుందరానికీ!' సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ దెబ్బతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. రోజులు గడిచిన కొద్దీ ఈ సినిమా వసూళ్లు క్రమంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలో 10వ రోజు భారీగా పెరిగి రూ. 67 లక్షలు వచ్చాయి. కానీ 11వ రోజు మాత్రం 21 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది.

    11 రోజులకు గాను

    11 రోజులకు గాను

    ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికీ!' 11 రోజుల్లో కలెక్షన్లు ఏ ప్రాంతంలో ఎలా వచ్చాయి అనేది చూస్తే, నైజాంలో రూ. 6.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 కోటి రూపాయలు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 92 లక్షలు, కృష్ణాలో రూ. 94 లక్షలు, నెల్లూరులో రూ. 61లక్షలతో.. రూ. 13.19 కోట్లు షేర్, రూ. 22.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

     హిట్ కు ఎన్ని కోట్లు కావాలంటే?

    హిట్ కు ఎన్ని కోట్లు కావాలంటే?

    పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 13.19 కోట్లు వసూలు చేసిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.58 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.07 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగి ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. సినిమాకి 11 రోజుల్లో దీనికి రూ. 20.35 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.65 కోట్లు రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఆ మేర కలెక్షన్స్ రాబట్టడం కష్టమే అంటున్నారు.

    English summary
    Natural Star Nani starrer Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction Collects 20.35 Cr in 11 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X