»   » వావ్ అనిపించేలా అ! చిత్ర కలెక్షన్లు.. యూఎస్‌లో ధమాకా..

వావ్ అనిపించేలా అ! చిత్ర కలెక్షన్లు.. యూఎస్‌లో ధమాకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి రూపొందించిన కాన్సెప్ట్ చిత్రం అ!. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసండ్రా, మురళీ శర్మ లాంటి నటీనటులు నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయినప్పటికీ ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల పరంగా మంచి పురోగతి సాధిస్తున్నది.

 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అ!

మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అ!

ఫిబ్రవరి 16న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన అ! చిత్రం తొలుత డివైడ్ టాక్‌ను సంపాదించుకొన్నది. ఆ టాక్‌ను అధిగమించి ఓవర్సీస్ మార్కెట్లో మిలియన్ డాలర్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. యూఎస్‌లోను మంచి కలెక్షన్లు సాధిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లను సొంతం చేసుకొంటున్నది.


 4 కోట్లకుపైగా కలెక్షన్లు

4 కోట్లకుపైగా కలెక్షన్లు

అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్లకుపైగా కలెక్ట్ చేసింది. అంటే సుమారు రూ. 4.13 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం శుక్రవారం 141,514 డాలర్లు, శనివారం 181,139, ఆదివారం 130,771, సోమవారం 56,655 డాలర్ల వసూళ్లను సాధించింది.


నైజాంలో మంచి స్పందన

నైజాంలో మంచి స్పందన

అ! చిత్రం నైజాంలో రూ.1.10 కోట్లు షేర్ (1.90 కోట్ల గ్రాస్)ను సొంతం చేసుకొన్నది. ఇక ఆంధ్రాలోని వైజాగ్‌ జిల్లాలో 29 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, గుంటూరులో 21 లక్షలు, నెల్లూరులో 6 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఆంధ్రాలో 1.18 కోటి షేర్‌ను రాబట్టింది.


ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లు

ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లు

ఇక సీడెడ్‌లో 22 లక్షల షేర్ (40 లక్షల గ్రాస్), కర్ణాటకలో 35 లక్షల షేర్ (90 లక్షల గ్రాస్), ఇతర ప్రాంతాలో 15 లక్షలు (45 లక్షల షేర్) సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4.5 కోట్ల షేర్‌ (9.4 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.


English summary
Nani's Awe movie inching towards million dollar club
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu