For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'భలే భలే మగాడివోయ్‌' షాకింగ్ కలెక్షన్స్...డిటేల్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాని తాజా చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' కలెక్షన్స్ పరంగా భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే భాక్సాఫీస్ వద్ద 25 కోట్లు షేర్ వసూలు చేసినట్లు సమచారం. కేవలం అమెరికాలోనే $1.4 మిలియన్ (9.29 కోట్లు) వసూలు చేసినట్లు సమచారం. తెలుగులో మిగతా రెండు రాష్ట్రాల్లో 16.25 కోట్లు కలెక్టు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచారం. ఓ చిన్న సినిమాకు ఇది షాకిచ్చే రికార్డే. ఈ సినిమా 30 కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిత్రం విషయానికి వస్తే...

  నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పించారు. ఈ చిత్రం 24 రోజుల క్రితం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

  Nani's Bhale Bhale Magadivoy's Collections

  లక్కి(నాని) కు చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు (మురళి శర్మ) కుమార్తెతో ఓ సంభంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు.

  తర్వాత నాని ఓ రోజు నందిన(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రాలకు తీసిపోకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసామని తెలిపారు.

  Nani's Bhale Bhale Magadivoy's Collections

  నటించడానికి వీలున్న ఓ మంచి పాత్ర ఈ సినిమాలో దొరికిందని, నిర్మాత సినిమాను క్వాలిటీగా రూపొందించారని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్‌కు వెళ్లి, చూసి నవ్వినవ్వి రావచ్చనినాని తెలిపారు.

  కెమెరా పనితనం సరికొత్తగా వుందని, ఈ చిత్రంలో ప్రతి పాత్ర నవ్విస్తూనే వుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోందని దర్శకుడు మారుతి తెలిపారు. మతిమరుపు కుర్రాడిగా నాని నటించిన పాత్ర సరికొత్తగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ విలువలతో ఎంటర్‌టైనర్‌గా రూపొందిందీ చిత్రం.

  మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

  English summary
  Nani's latest release, Bhale Bhale Magadivoy, touched the sensational 25 crore worldwide share milestone. The film collected nearly $1.4 million (9.29 crores) in America alone and in the Telugu states and rest of India, it raked up close to 16.25 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X