twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1వ రోజు: ‘నాన్నకు ప్రేమతో’ ఏరియావైజ్ కలెక్షన్స్ లిస్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం నిన్న విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ ఓపెనింగ్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన 25వ సినిమా కావడం, సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయడంతో సినిమాకు తొలిరోజు రెస్పాన్స్ వచ్చింది.

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘నాన్నకు ప్రేమతో' చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.46 కోట్ల షేర్ సాధించింది. ‘బాహుబలి', ‘శ్రీమంతుడు' సినిమాల తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో' చిత్రం నిలిచింది.

    సినిమా దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. రూ. 55 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు రూ. 50 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన సినిమా లేదు. తొలి రోజు కలెక్షన్స్ భారీగా వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సారి రూ. 50 కోట్ల మార్కు అందుకోవడం ఖాయం అంటున్నారు.

    మరో వైపు యూఎస్ఏలో కూడా ‘నాన్నకు ప్రేమతో' గ్రాండ్ గా మొదలైంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం...మంగళవారం 73 లొకేషన్లలో సినిమా ప్రదర్శితం అయింది. $ 346,056 [రూ 2.31 కోట్లు] వసూలు చేసింది. స్లైడ్ షోలో తెలుగు రాష్ట్రాల్లో ‘నాన్నకు ప్రేమతో' ఏరియా వైజ్ కలెక్షన్ డీటేల్స్...

    నైజాం

    నైజాం

    నైనాం ఏరియాలో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 4.17 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రూ. 6.3 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

    సీడెడ్

    సీడెడ్

    సీడెడ్ ఏరియాలో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 3.1 కోట్ల షేర్ సాధించింది. బాహుబలి రూ. 5.08 కోట్లతో తొలి స్థానంలో ఉంది.

    గుంటూరు

    గుంటూరు

    గుంటూరు ఏరియాలో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 1.53 కోట్ల షేర్ సాధించింది. బాహుబలి రూ. 2.54 కోట్లతో తొలి స్థానంలో ఉంది.

    వైజాగ్

    వైజాగ్

    వైజాగ్ ఏరియాలో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 1.17 కోట్ల షేర్ సాధించింది. బాహుబలి రూ. 1.75 కోట్లతో తొలి స్థానంలో ఉంది.

    కృష్ణ

    కృష్ణ

    కృష్ణ జిల్లాలో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 84 లక్షలు వసూలు చేసింది. బాహుబలి రూ. 1.25 కోట్లతో తొలి స్థానంలో ఉంది.

    నెల్లూరు

    నెల్లూరు

    నెల్లూరులో నాన్నకు ప్రేమతో తొలి రోజు రూ. 50 లక్షలు వసూలు చేసింది. బాముబలి రూ. 93 లక్షల షేర్ తో తొలి స్థానంలో ఉంది.

    ఈస్ట్

    ఈస్ట్

    ఈస్ట్ గోదావరిలో తొలి రోజు నాన్నకు ప్రేమతో రూ. 1.17 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రూ. 1.98 కోట్లు వసూలు చేసింది.

    వెస్ట్

    వెస్ట్

    నాన్నకు ప్రేమతో తొ తొలి రోజు వెస్ట్ లో రూ. 98 లక్షలు వసూలు చేసింది. బాహుబలి రూ. 2.57 కోట్లతో తొలి స్థానంలో ఉంది.

    English summary
    Nannaku Prematho, which opened to mixed responses, received wide acclaim from critics. The film was the first release in this year's Pongal race and it marks NTR's 25th film. It has the highest pressure of proving NTR's box-office stamina as he is lagging behind in terms of collections, when compared to his peers. But, it looks like Nannaku Prematho is finally here to get him out of it. The film collected a share of 13.46 Cr in Telugu states alone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X