»   »  ముగిసినట్లే:‘నాన్నకు ప్రేమతో’ టోటల్ కలెక్షన్ ఎంత?

ముగిసినట్లే:‘నాన్నకు ప్రేమతో’ టోటల్ కలెక్షన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' సినిమా సంక్రాంతికి విడుదలై గడిచిన మూడు వారాల్లో బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కొత్త సినిమాలు విడుదల ఉండటంతో కొన్ని మెయిన్ ఏరియాల్లో మినహా దాదాపుగా అన్ని ఏరియాల్లో సినిమాను ఎత్తేసారు.

చాలా కాలంగా జూ ఎన్టీఆర్ ఎదురు చూస్తున్న రూ. 50 కోట్ల మార్కు..... ఈ సినిమాతో అందుకున్నారు. గతంలో ఎన్టీఆర్ పలు హిట్ చిత్రాల్లో నటించినా ఏ సినిమా కూడా రూ. 50 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకోలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఆల్రెడీ 50 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకోవడంతో.... ఎన్టీఆర్ అభిమానులకు ఏదో వెలితిగా ఉండేది. ఇపుడు ఎన్టీఆర్ సినిమా కూడా రూ. 50 కోట్ల క్లబ్ లో చేరడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Nannaku Prematho Movie Total Box Office Collections

జనవరి 13న విడుదలైన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం తొలి వారాంతం రూ. 21 కోట్లు వసూలు చేసింది. మూడు వారాలు గడవక ముందే ఈ చిత్రం రూ. 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ మొత్తం రూ. 55.9 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో చిత్రం అక్కడక్కడ కొన్ని మెయిన్ ఏరియాల్లో ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఓవరాల్ బిజినెస్ మరో 2 కోట్లు పెరిగే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
“Nannaku Prematho” was released grandly on Jan 13th 2016 globally and opened with an average talk on its first day and picked up gradually. The movie has collected Rs.21 crores in the first weekend and has crossed the magical club of Rs. 50 crores recently and till now the movie has managed to collect Rs. 55.9 crores at the worldwide box-office.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu