»   »  నాన్ లోకల్స్‌ను సైతం రెచ్చగొట్టిన నాని... వసూల్లే వసూళ్లు!

నాన్ లోకల్స్‌ను సైతం రెచ్చగొట్టిన నాని... వసూల్లే వసూళ్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నేను లోకల్' అంటూ ఇటీవల బాక్సాఫీసు బరిలో దూకిన హీరో నాని.... నాన్ లోకల్ ఏరియాలోనూ వసూళ్లు కుమ్మేస్తున్నాడు. అమెరికాలో ఉండే నాన్ లోకల్స్(తెలుగు ప్రేక్షకుల)ను తన సినిమా వైపు ఆకర్షిస్తున్నాడు.

నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన 'నేను లోకల్‌' చిత్రం అమెరికాలో సూపర్ డూపర్ వసూళ్లు సాధిస్తోంది. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) 750,628 డాలర్లకు (5.04 కోట్లు) వసూలు చేసి సత్తా చాటింది.


ఆదివారం ఒక్కరోజే 105,466 డాలర్లు వసూలు చేసిందంటే...ఈ సినిమాకు అక్కడ ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ మార్కను అందుకోవడం ఖాయం అంటున్నారు.


 టాప్ 10లో చేరడం ఖాయం

టాప్ 10లో చేరడం ఖాయం


ఇప్పటి వరకు నాని నటించిన సినిమాలు ఏవీ అమెరికాలో 1 మిలియన్ డాలర్ షేర్ సాధించలేదు. నాని ఇంతకు ముందు నటించిన భలే భలే మగాడివోయ్ అక్కడ 1 మిలియన్ కుపైగా గ్రాస్ వసూలు చేసినా షేర్ మాత్రం రాబట్టలేక పోయింది. అయితే ‘నేను లోకల్' మూవీతో నాని టాప్ 10 ఓవర్సీస్ షేర్ లిస్టులో చోటు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. బాహుబలి టాప్

బాహుబలి టాప్


ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమాల విషయానికొస్తే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం 7.51 మిలియన్ డాలర్లు సాధించి నెం. 1 స్థానంలో ఉంది. శ్రీమంతుడు

శ్రీమంతుడు


మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం అమెరికాలో 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. అ..ఆ

అ..ఆ


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అ..ఆ' చిత్రం 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ 3 పొజిషన్లో నిలిచింది.‘ఖైదీ నెం 150'

‘ఖైదీ నెం 150'

మెగా స్టార్ చిరంజీవి నటించిన కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెం 150' చిత్రం అమెరికాలో 2.44 డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో ఉంది. నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో


సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం 2.02 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఐదో స్థానంలో ఉంది. అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది చిత్రం 1.90 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆరో స్థానంలో ఉంది. జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ 1.80 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఏడో స్థానంలో ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి


బాలయ్య హీరోగా క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ 1.65 మిలియన్ డాలర్లు వసూలు చేసి 8వ స్థానంలో ఉంది. సీతమ్మ వాకిట్లో

సీతమ్మ వాకిట్లో


మహేష్, వెంకీ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 1.64 మిలియన్ డాలర్లు వసూలు చేసి 9వ స్థానంలో ఉంది. ఊపిరి...

ఊపిరి...


నాగార్జున నటించిన ఊపిరి చిత్రం 1.57 మిలియన్ డాలర్లు వసూలు చేసి 10వ స్థానంలో ఉంది. నేను లోక‌ల్‌ '... ఫస్ట్ వీకెండ్ ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌ వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Nani starrer 'Nenu Local' took American box-office by storm. The opening weekend collections stunned everyone. Nani has emerged as a force to reckon with. Check out the USA Box office Collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu