»   » ఆశ్చర్యపోయే స్దాయిలో : 'నేను లోక‌ల్‌ '... ఫస్ట్ వీకెండ్ (ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌)

ఆశ్చర్యపోయే స్దాయిలో : 'నేను లోక‌ల్‌ '... ఫస్ట్ వీకెండ్ (ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని లేటెస్ట్ మూవీ 'నేను లోకల్' అంచనాల్ని మించిపోయి దూసుకుపోతోంది. ఒక స్టార్ హీరో సినిమా తరహాలో వసూళ్లు రాబ‌డుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. దిల్ రాజు, నాని, కీర్తి సురేష్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రేక్షకులను ధియేటర్స్ కు తీసుకు వస్తూ హౌస్ ఫుల్ చేస్తోంది.

ఫస్ట్ వీకెండ్ లోనే 24 కోట్లు గ్రాస్ కలెక్టు చేసింది. అందులో 15.04 కోట్లు షేర్ వస్తుంది. నాని గత చిత్రాల కలెక్షన్స్ రికార్డ్ లన్నిటిని ఈ చిత్రం బ్రద్దలు కొట్టింది. ఓ విధంగా ఫస్ట్ వీకెండ్ లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. రెండో వారం నుంచీ ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేసిన వారంతా లాభాలలో పడిపోతారంటున్నారు.


నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భలే భలే మొగాడివోయ్ లైఫ్ టైమ్ రెవిన్యూతో ఈ కలెక్షన్స్ సమానం కావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాని కెరీర్ లో ఊహించని హైయిస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు.


Nenu Local First Weekend Collections

నేను లోలక్ ఫస్ట్ వీసెండ్ కలెక్షన్స్ (షేర్):


నైజాం : Rs 4.34 కోట్లు


సీడెడ్: Rs 1.45 కోట్లు


ఉత్తరాంధ్ర: Rs 1.42 కోట్లు


గుంటూరు: Rs 0.89 కోట్లు


కృష్ణా : Rs 0.85 కోట్లు


ఈస్ట్ గోదావరి: Rs 1.08 కోట్లు


వెస్ట్ గోదావరి: Rs 0.66 కోట్లు


నెల్లూరు: Rs 0.35 కోట్లు


ఎపి & నైజాం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ : 11.04 కోట్లు


మొత్తం షేర్: Rs 15.04 కోట్లు (అమెరికా: Rs 2.25 కోట్లు, కర్ణాటక: Rs 1.15 కోట్లు, భారత్ లో మిగలిన ప్రాంతాలు & మిగిలిన దేశాల్లో: Rs 0.60 కోట్లు)


ఓవర్ సీస్ లోనూ, ఇటు ఏపీ తెలంగాణల్లో కూడా నేను లోకల్ కుమ్మేస్తోంది. మీడియం రేంజ్ హీరోల్లో తనే టాప్ పొజిషన్ లో ఉన్నానని ప్రూవ్ చేశాడు ఈ చిత్రంతో నాని. ఈ హీరో కెరీర్ లో ఇప్పటివరకూ ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. నాని-కీర్తి సురేష్ రొమాంటిక్ ఫీల్‌ను ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
తారాగ‌ణం: నాని, కీర్తి సురేశ్, నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, పోసాని కృష్ణమురళి తదితరులు
రచన: సాయి కృష్ణ
చాయాగ్ర‌హ‌ణం: నిజార్ షఫీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: శిరీష్
కథ - స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
స‌మ‌ర్ప‌ణ: దిల్‌రాజు
క‌థ‌నం, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన

English summary
Nani & Keerthy Suresh starrer 'Nenu Local' collected a Gross of Rs 24 crore and Share of 15.04 crore in the First Weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu