»   » ప్చ్...‘అత్తారింటికి దారేది’కి కలిసి వచ్చిందేమీ లేదు

ప్చ్...‘అత్తారింటికి దారేది’కి కలిసి వచ్చిందేమీ లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హిట్ కాగానే...ఎడిటింగ్ లో లేచిపోయిన సీన్స్ ని కలిపి మళ్లీ కలెక్షన్స్ ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూండటం మామూలే. తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్' అత్తారింటికి దారేది' లో ఆరు నిముషాల పుటేజ్ నవంబర్ 1 నుంచి కలిపారు. అయితే అది వర్కవుట్ కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. వీటి మూలంగా కలెక్షన్స్ కి ఒరిగిందేమీ లేదు. ఈ సీన్స్ పై ఎంతో ఆశలు పెట్టుకున్న డిస్ట్ర్రిబ్యూటర్ కి నిట్టూర్పు మాత్రమే మిగిలింది.. ఫస్టాఫ్ లో మూడు సీన్స్, సెకండాఫ్ లో రెండు సీన్స్ కలిపి వదలారు. లెంగ్త్ ఎక్కువైందని తీసేసిన సీన్స్ ని కలిపారు.

''తెలుగు సినీ చరిత్రలో 'మగధీర' ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. ఆ చిత్ర నిర్మాణంలో నేను భాగస్వామిని. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాకీ నేనే నిర్మాతను. ఇలా రెండు మేటి చిత్రాల్లో భాగం పంచుకొన్నందుకు ఆనందంగా ఉంది''అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. క్లిష్టసమయంలో పవన్‌, త్రివిక్రమ్‌లు అండగా నిలబడ్డారు. పైరసీకి గురైనా.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందా? అని అందరూ అడుగుతున్నారు. ఆ మైలు రాయిని చేరుకొనే అవకాశాలున్నాయి'' అన్నారు.

సమంత మాట్లాడుతూ ''యాభై రోజుల్లో సాధించాల్సిన వసూళ్లు ఇరవై అయిదు రోజుల్లోనే దక్కాయి. ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇటీవల కృతజ్ఞతల సభలో పవన్‌ నన్ను మెచ్చుకొన్నారు. అదే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. పవన్‌, త్రివిక్రమ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. ఈ ముగ్గురూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది'' అని చెప్పింది.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daaredi has become all-time blockbuster in Telugu film industry. To extract more collections, the makers included 6 minutes extra footage from November 1st. They thought these extra scenes would attract more audiences and thereby increase collections further. But this move didn't work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more