twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు నుంచి అఖిల్ దాకా అన్నీ అవే..లిస్ట్ ఇదిగో

    By Srikanya
    |

    హైదరాబాద్ : క్రితం సంవత్సరం రీమేక్ లు పెద్దగా తెలుగు పరిశ్రమలో రాలేదు. తమిళ సినిమాలే హిట్టైనవి ఇక్కడ రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ రీమేక్ ల వైపు మళ్లింది. వరస పెట్టి చిన్నా, పెద్దా హీరోలంతా రీమేక్ లపై పడ్డారు. రీమేక్ లకోసం తమిళ,మళయాళ, హిందీ పరిశ్రమల వైపు ప్రతీ శుక్రవారం చూస్తున్నరు హీరోలు, నిర్మాతలు.

    రీమేక్ అనేది ఎంతవరకూ సేఫ్ అనేది ప్రక్కన పెడితే...వెంటనే బిజినెస్ అవటానికి ఓ మార్గం అంటారు ట్రేడ్ వర్గాలు వారు. అలాగే హీరోలు సైతం రీమేక్ లో చేయటమనేది సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఫీలవుతూంటారు. మహేష్ లాంటి కొంతమంది హీరోలు తప్ప మిగతా అందరూ రీమేక్ ల వైపు అడపా దడపా చూస్తున్నవారే కావటం విశేషం.

    ఆ మధ్యన రీమేక్ చేసిన సినిమాలు కూడా ఇక్కడ పెద్దగా వర్కవుట్ కాక మేకుల్లా భాక్సాఫీస్ కు గుచ్చుకోవటంతో కాస్త ఆ జోరు తగ్గింది. దానికి తోడు రెగ్యులర్ గా రీమేక్ లు చేసే వెంకటేష్ కూడా జోరు తగ్గించారు. అయితే ఇప్పుడు కొత్త తరం మళ్లీ రీమేక్ లు వైపు చూస్తోంది. తెలుగులో త్వరలో రాబోతున్న రీమేక్ లు ఇక్కడ ఓ సారి చూద్దామా..

    చిరంజీవి

    చిరంజీవి

    గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గ నడిచిన చిరంజీవి 150వ చిత్రం విషయం ఓ రీమేక్ అని ఆ మధ్యన రామ్ చరణ్ తేల్చేసారు. సినిమాపై ఇప్పటికే స్పష్టత రాగా, మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని రాంచరణ్‌ తెలియచేసారు. విజయ్‌ హీరోగా తమిళంలో విజయం సాధించిన ‘కత్తి' రీమేక్‌లో చిరంజీవి నటించనున్నారు. దీనికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు వేగం పుంజుకున్నాయి. ఇక మార్చిలో మొదలెట్టడమే ఆలస్యం.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    తండ్రి తమిళ రీమేక్ లో చేస్తూంటే కొడుకు రామ్ చరణ్ కూడా మరో తమిళ రీమేక్ ని ఎంచుకున్నారు. జయం రవి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘తని ఒరువన్‌'. అరవింద స్వామి విలన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో రాంచరణ్‌ తెలుగులో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు.

    నాగార్జున

    నాగార్జున

    సంక్రాంతికి ‘సొగ్గాడే చిన్నినాయనా' అంటూ హిట్ కొట్టిన నాగార్జున కూడా ఓ రీమేక్ లో చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘వూపిరి'. ఫ్రెంచి చిత్రం ‘ఇన్‌టచ్‌బుల్స్‌'ను తెలుగు, తమిళ భాషాల్లో ‘వూపిరి'గా రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాగార్జున చేయని పాత్రను ఇందులో పోషిస్తున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమయ్యే పాత్రలో నాగ్‌ కనిపించటం విశేషం.

    నాగచైతన్య

    నాగచైతన్య

    తండ్రి బాటలోనే నాగచైతన్య కూడా ఓ రీమేక్ తో నడవబోతున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘మజ్ను'(వర్కింగ్‌ టైటిట్‌). మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌'ను తెలుగులో ‘మజ్ను'గా తెరకెక్కిస్తున్నారు. చైతన్య సరసన అనుపమ పరమేశ్వరన్‌, శృతిహాసన్‌ నటిస్తున్నారు

    సందీప్‌ కిషన్‌

    సందీప్‌ కిషన్‌

    తమిళ-మలయాళ భాషల్లో పెద్ద హిట్టైన చిత్రం ‘నేరం'. సందీప్‌ కిషన్‌ ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ‘అసాధ్యుడు', ‘మిస్టర్‌ నూకయ్య' చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌ కన్నెగంటి తాజా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందీప్‌ సరసన కీర్తి సురేష్‌ నటించనుంది.

    బెల్లంకొండ శ్రీనివాస్

    బెల్లంకొండ శ్రీనివాస్

    అల్లుడు శ్రీను చిత్రంతో పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్...తన తదుపరి చిత్రం స్పీడున్నోడు ని భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో చేస్తున్నారు. తమిళంలో విజయవంతమైన సుందరపాండ్యన్ రీమేక్ ఇది.

    నారా రోహిత్

    నారా రోహిత్

    నారా రోహిత్ ప్రస్తుతం తుంటరి టైటిల్ తో కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మాన్ కరాటే అనే తమిళ చిత్రం రీమేక్.

    రానా

    రానా

    దగ్గుపాటి రానా తాజాగా ‘బెంగళూరు డేస్‌' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రానాతో పాటు ఆర్య, శ్రీదివ్య, రాయ్‌లక్ష్మీ తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ప్రసాద్‌ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    సుమంత్

    సుమంత్

    అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ త్వరలో విక్కీ డోనర్ రీమేక్ లో నటించనున్నారు. ఈ మేరకు త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

    రవితేజ

    రవితేజ

    అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్పెషల్ 26 చిత్రాన్ని త్వరలో రవితేజ హీరోగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.

    అల్లరి నరేష్

    అల్లరి నరేష్

    కన్నడంలో విజయవంతమైన విక్టరీ చిత్రాన్ని అల్లరి నరేష్ హీరోగా...ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

    సాయి ధరమ్ తేజ

    సాయి ధరమ్ తేజ

    కన్నడంలో విజయవంతమైన మరో చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ రామా చారి ని...సాయి ధరమ్ తేజ తో రూపొందిచటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    రామ్ చరణ్ ఇంకోటి

    రామ్ చరణ్ ఇంకోటి

    జాన్ అబ్రహం హీరోగా రూపొందుతున్న రాకీ హ్యాండ్సమ్ చిత్రం రీమేక్ పై రామ్ చరణ్ ఆసక్తి చూపెడుతున్నట్లు సమాచారం.

    అఖిల్..

    అఖిల్..

    రెండేళ్ల కిందట బాలీవుడ్‌లో హిట్ కొట్టిన 'యే జవానీ హై దివానీ' రీమేక్ పై అఖిల్ కన్ను పడిందని దానితో సెకండ్ సినిమా హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

    English summary
    There are many crazy projects lined up in 2016 but this time there are some interesting remakes releasing this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X