»   »  ఎన్టీఆర్ ఎప్పుడు చేరతాడో...వెయిటింగ్

ఎన్టీఆర్ ఎప్పుడు చేరతాడో...వెయిటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు భారీ సినిమాలు ఇప్పుడు అన్నీ యాభై కోట్ల క్లబ్ లో జాయిన్ అవటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ ఇప్పటికే ఈ కలెక్షన్స్ ని రీచ్ అయ్యి..ఈ క్లబ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ కి సరైన హిట్ పడకపోవటంతో ఇంకా అటు వెళ్లలేదు. అయితే ఎన్టీఆర్ సినిమాలకో ప్లస్ ఉంది. భాక్సాఫీస్ వద్ద టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగుంటాయి. ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద ఫ్లాఫ్ గా నిలిచిన రామయ్యా వస్తావయ్యా చిత్రం సైతం ముప్పై కోట్లు వరకూ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నేపధ్యంలో సరైన హిట్ పడితే ఎన్టీఆర్ స్టామినా ఏంటనేది తెలుస్తుంది. యాభై కోట్ల కలెక్షన్స్ ని దాటేస్తాడు. రభస చిత్రంతో ఆ కోరిక తీరుతుందని భావిస్తున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో సాగుతోంది.

NTR fans waiting for 50 crores club

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Hope NTR will achieve 50 crore mark with his next outing Rabhasa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu