»   » ఎన్టీఆర్ టార్గట్... మహేష్, అల్లు అర్జున్ , అందుకే ఈ వ్యూహం

ఎన్టీఆర్ టార్గట్... మహేష్, అల్లు అర్జున్ , అందుకే ఈ వ్యూహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంలో లాగ హీరోలు కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆడితే చాలు అనుకోవటం లేదు.ముఖ్యంగా తోటి హీరోలు జయించి, జెండా పాతిన మిగతా ప్రాంతాలలో తమ సినిమాలతో హిట్ కొట్టి, తమ జెండా కూడా అక్కడ పాతాలని ఫిక్స్ అవుతున్నారు. తమ మార్కెట్ ని పెంచుకోవటానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందుకోసం కొత్త స్ట్రాటజీలు రచించి అమలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఆయన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' మార్కెట్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ప్రమోషన్ లో కొత్త స్ట్రాటజీలు ప్లాన్ చేసి అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్ట్రాటజీల్లో భాగంగా చిత్రం ప్రమోషన్ ని ఇండియాలో , యుఎస్ లోని వేర్వేరు సిటీల్లో ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కు యుఎస్ లో మంచి క్రేజ్ ఉంది. తన సినిమాలకు కూడా అలాగే యుఎస్ మార్కెట్ రావాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.

Ntr's Janatha Garage Events in USA and Kerala

ముఖ్యంగా ఆడియో పంక్షన్ ని యుఎస్ లో న్యూజెర్శీలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ కి బాగా పట్టున్న కేరళ లో కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అనంతరం కేరళల కొచ్చిన్ లో ఓ పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్, నిత్యామీనన్ లను అక్కడ ప్రొజెక్టు చేయనున్నారు.

ఆ తర్వాత విజయవాడ, వైజాగ్ లలో వరస పట్టి ఈవెంట్ లు చేస్తారు. హైదరాబాద్ సరేసరి. అలా మొత్తం కవర్ చేయనున్నారు. ఈసారి ఎట్టిపరిస్దితుల్లోనూ నాన్నకు ప్రేమతో చిత్రంతో పెరిగిన యుఎస్ కలెక్షన్స్ ని రెట్టింపు చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. అలాగే కేరళలోనూ తమ మార్కెట్ ని విస్తరించి, తదుపరి చిత్రాలు అక్కడ కూడా ఒకే రోజు విడుదల అయ్యే మార్కెట్ క్రియేట్ చెయ్యాలని ఆలోచన.

English summary
After Janatha Garage audio launch, the team is also planning to hold a big event in Kerala as the movie has Mohanlal in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu