OG Box Office: ఓజీతో ఎన్టీఆర్, ప్రభాస్ రికార్డులు బ్రేక్.. ఆంధ్రా, నైజాం లెక్కలు మార్చేసిన పవన్ కళ్యాణ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషించగా..అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీ సాధించిన రికార్డులు ఏంటీ? అనేది పరిశీలిస్తే..
ఓజీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లతో పాటు పవన్ కళ్యాణ్ కారణంగా ఓజీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
ఓజీ రెండు రోజుల కలెక్షన్స్
2025లో టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ఓజీ అంచనాలకు తగినట్లుగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 22 కోట్ల రూపాయ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ.. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 154 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. రెండో రోజు 27 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో ఓజీ 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌కు దగ్గరైంది. రెండు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 90.85 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో 12 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 43 కోట్ల రూపాయల చొప్పున వసూళ్లు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ రికార్డ్
పవన్ కళ్యాణ్ ఛరిష్మాతో ఓజీకి రికార్డ్ కలెక్షన్స్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ రికార్డ్ సొంతం చేసుకుంది. తొలి రోజు షేర్ పరంగా భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఓజీ దుమ్మురేపుతూ టాప్ 10లో స్థానం సంపాదించింది. 73.97 కోట్ల రూపాయల షేర్‌తో ఆర్ఆర్ఆర్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండగా .. పుష్ప 2 (69.93 కోట్ల రూపాయలు), ఓజీ (62.35) కోట్ల రూపాయలు అందుకుంది. ఇప్పటి వరకు మూడు, నాలుగు స్థానాల్లో దేవర (61.65 కోట్లు), సలార్ (47.60 కోట్ల రూపాయలు) ఉండేవి. ఇప్పుడు ఓజీ రాకతో ప్రభాస్, ఎన్టీఆర్ రికార్డులు గల్లంతైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఓజీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











