OG 12 days Box Office: 300 కోట్ల క్లబ్‌లో ఓజీ.. 2025లో పవన్ కల్యాణ్ రేర్ రికార్డు .. 12వ రోజు ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా అభిమానులందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. 2025 సంవత్సరంలో రిలీజైన తెలుగు చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం గత 11 రోజులుగా ఎంత వసూలు చేసింది? ఈ చిత్రం 12వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.

OG Day 12 Expected Box Office Collections

ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి.ఓజీ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 230 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని చేపట్టిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది.

ఓజీ చిత్రం తొలి ఆట నుంచే ప్రభంజనం సృష్టిస్తూ ప్రస్తుతం రెండో వారంలో కోనసాగుతున్నది. ఈ చిత్రం మొదటి వారంలో తెలుగులోనే 172 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో శుక్రవారం 4.75 కోట్లు, శని వారం 4.6 కోట్ల రూపాయలు, ఆదివారం 4.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 185 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను నైజాం, ఆంధ్రాలో రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓజీ చిత్రానికి సంబంధించిన నైజాం, ఆంధ్రా ఏరియాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం నైజాంలో 51 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సీడెడ్‌లో 17 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 16 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 12.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10 కోట్ల రూపాయలు, నెల్లూరులో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.5 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 221 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఈ చిత్రం 81 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 308 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, 12వ రోజున కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరో 4 కోట్ల రూపాయలను వసూలు చేయవచ్చని అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం 312 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. లేట్ నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగితే కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Read more about: og pawan kalyan box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X