OG Day 3 Collections Worldwide: 200 కోట్లకు చేరువగా ఓజీ .. పవన్ కళ్యాణ్ మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?

హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఓజీ. పవన్ వీరాభిమాని సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఓజీని నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3వ రోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

ఓజీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

OG Day 3 Estimated Box Office Collections Worldwide Pawan Kalyan s Movie eyes on 200 crores mile stone

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

ఓజీ రెండు రోజుల కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్స్‌ ద్వారా 21 కోట్ల రూపాయలతో కలిపి తొలి రోజు ఓజీ వరల్డ్ వైడ్‌గా 154 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. పెయిడ్ ప్రీమియర్స్‌తో 21 కోట్ల రూపాయలు, తొలి రోజు ఇండియా వైడ్‌గా 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఓజీ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. 5 మిలియన్లకు చేరువైన ఓజీ ఇప్పటి వరకు 4.85 డాలర్లు ( భారత కరెన్సీలో సుమారుగా 43 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. దాంతో రెండ్రోజుల్లో ఓజీ చిత్రం 173. 85 కోట్ల రూపాయల గ్రాస్.. 108 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వసూళ్లు
పవన్ కళ్యాణ్ మూవీకి తొలి రోజున 63 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు నాట ఏరియాల వారీగా ఓజీ వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 30.40 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9.23 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.20 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 8.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.85 కోట్ల రూపాయలు, గుంటూరులో 7 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఓజీ పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓజీ మూడో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌కు తోడు వీకెండ్ కావడంతో ఓజీకి మూడో రోజు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 31 శాతం, తమిళ్‌లో 14 శాతం, హిందీలో 7 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఓజీకి మరింత బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, కర్ణాటకలో కోటి రూపాయలు, కేరళ + హిందీలో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. దాంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు చేరువై.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X