OG Day 8 Collections Worldwide: బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న ఓజీ.. 300 కోట్లకు చేరువగా పవన్ కల్యాణ్ మూవీ

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

OG Day 8 Estimated Box Office Collections

ఓజీ సినిమాకు వచ్చిన హైప్‌తో తెలుగ రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్‌లో రికార్డు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 225 కోట్ల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగేతర భాషల్లో ఓజీ చిత్రం గత 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 18 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 6 కోట్ల వసూళ్లు సాధించాయి. 28.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కర్ణాటక మినహా ఏ ప్రాంతంలోను బాక్సాఫీస్‌పై ప్రభావం చూపించలేకపోయింది.

ఆంధ్రా, తెలంగాణలో ప్రీమియర్ల ద్వారా 22 కోట్ల రూపాయలు, తొలి రోజు 67 కోట్ల రూపాయలు, రెండో రోజు 19 కోట్ల రూపాయలు, మూడో రోజు 18 కోట్ల రూపాయలు, 4వ రోజు 19 కోట్లరూపాయలు, 5వ రోజు 7.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 7 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 166 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 45 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 14.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 13 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 11 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, గుంటూరులో 10 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 8.5 కోట్ల రూపాయలు, నెల్లూరుల 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓజీ సినిమా ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్నది. వారం రోజులుగా స్థిరంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 5.5 మిలియన్లకు చేరువైంది. మిగితా దేశాల్లో కలిపితే ఈ సినిమా 7 మిలియన్లకుపైగా వసూళ్లను అంటే సుమారుగా 63 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 166 కోట్లు, తెలుగేతర రాష్ట్రాల్లో 28.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 63 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 253.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా 8వ రోజు కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు, ఇతర భాషల్లో కలిపి 6 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 7 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 260 కోట్ల రూపాయల మేర కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X