OG Karnataka Collection: కర్ణాటకలో పవన్ ఆల్‌టైం రికార్డ్.. ప్రీమియర్స్‌తో దంచి కొట్టిన ఓజీ
సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది ఓజీ. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు పెద్ద మార్కెట్‌గా ఉన్న కర్ణాటకలోనూ పెయిడ్ ప్రీమియర్స్ విషయంలోనూ ఓ రికార్డ్ అందుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక తెలుగు రాష్ట్రాలలో ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.
ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
కర్ణాటకలో ఓజీ రికార్డ్
సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ సందర్భంగా దానికి ముందు రోజు రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాలు, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. పవన్ కళ్యాణ్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కర్ణాటకలోనూ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. కర్ణాటక వ్యాప్తంగా 200 షోలు ప్రదర్శితమవ్వగా.. వీటిలో ఒక్క బెంగళూరు నగరంలోనే 125కు పైగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. దాంతో మొత్తం 200 పెయిడ్ ప్రీమియర్ షోలకు గాను పవన్ కళ్యాణ్ మూవీకి 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి కర్ణాటకలో 7 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
తొలి రోజు వసూళ్ల జాతర
మొత్తంగా తొలి రోజు ఓజీ కలెక్షన్స్ చూస్తే.. ప్రీమియర్స్ + అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వరల్డ్ వైడ్‌గా 114 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో 27 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. ఒక్క నార్త్ అమెరికాలోనే 26 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది, ఆంధ్రాలో 31 కోట్ల రూపాయలు, నైజాంలో 26 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.50 కోట్ల రూపాయలు రాబట్టాడు పవన్ కళ్యాణ్. ఇక ఫస్ట్ డే ఓవరాల్‌గా ఓజీ వరల్డ్ వైడ్‌గా 170 నుంచి 180 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











