OG Day 1 Collections: ఓజీ బాక్సాఫీస్ సంచలనం.. పుష్ప 2 రికార్డుపై పవన్ మూవీ గురి.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ జైత్రయాత్ర మొదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ సునామీని తలపిస్తున్నది. ప్రీ సేల్స్ ఓపెన్ అయిన ప్రతీ చోట నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఊహకు అందని విధంగా తలపిస్తున్నది. డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు అంచనా వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్‌లో ఓజీ సినిమాకు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. నార్త్ అమెరికాలో నెల రోజుల కిందటే రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. అమెరికాలో ప్రీమియర్స్ కోసం 3 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 26 కోట్లకుపైగా వసూళ్లు నమోదయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ అమెరికా థియేటర్‌ సినిమార్క్ వెస్ట్ ప్లానోలో 100K డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టడం ఓ రికార్డుగా పేర్కొంటున్నారు. ఈ థియేటర్‌లో 39 షోలకు గాను 100K డాలర్లు అంటే 89 లక్షల రూపాయలు ఒక్క థియేటర్‌లోనే వసూలు చేసింది. ఈ సినిమా అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

OG Movie Day 1 Predicted Box Office

హైదరాబాద్‌లో 93 షోలు ప్రీమియర్లుగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ షోల ద్వారా ఇప్పటి వరకు 3.5 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తొలి రోజు కోసం 10 కోట్ల రూపాయలు 800 షోల ద్వారా వసూలు అయ్యాయి. నైజాంలో అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 చిత్రం 1.72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ రికార్డును ఓజీ తుడిచిపెట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏపీ విషయానికి వస్తే.. కర్నూలు, తిరుపతి, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో కలెక్షనల్ తుఫాన్ కనిపిస్తున్నది. పలు జిల్లాలో పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రీమియర్ షోలకు సుమారుగా 4 కోట్ల రూపాయలు వసూలైందని చెబుతున్నారు

కర్ణాటకలో ఓజీ వసూళ్ల ప్రభంజనం కనిపిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్లను బెంగళూరులో 42 షోలు ప్రదర్శిస్తున్నారు. వాటి ద్వారా 90 లక్షలు రూపాయలు రాబట్టింది. బెంగళూరులో ఇక తొలి రోజు కోసం 450 షోల ద్వారా 2 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. దాదాపు బెంగళూరులో ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 3 కోట్ల రూపాయలు కడపటి వార్తలు అందే సరికి వచ్చాయి. ఇక కర్ణాటకలో మంగళవారం రాత్రి వరకు 1 లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 9 కోట్ల రూపాయలు నమోదుఅయ్యాయయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపి రికార్డులు తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. డే 1 కలెక్షన్లు 80 కోట్ల షేర్ 160 కోట్ల గ్రాస్ (ప్రీమియర్లతో కలిపి ) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఈ రేంజ్ మరింతే పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సునామీని తలపిస్తున్నది. పలు చోట్ల ఎక్కువ షోల కోసం డిమాండ్ వస్తున్నదని డిస్ట్రిబ్యూటర్లు తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో పుష్ప క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: og pawan kalyan pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X