OG USA Box Office: కూలీ రికార్డును బ్రేక్ చేసిన OG.. టాప్ 5 స్థానంలో పవన్ కల్యాణ్ మూవీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు.
ఓజీ సినిమా పాటలు యాక్షన్ గ్లింప్స్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆలస్యమైనా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం మరింత పెరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా యూఎస్‌లో ప్రదర్శించిన ప్రీమియర్ షోల కలెక్షన్ల విషయంలో రికార్డుల మోత మోగిస్తున్నది. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఓజీ సినిమాకు పెయిండ్ ప్రీమియర్ల ద్వారా భారీ కలెక్షన్లు లభించాయి. ఈ సినిమా ప్రీమియర్లకు 3.138 మిలియన్ డాలర్లు అంటే 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోను, అలాగే ఏ లిస్ట్ హీరోల టాప్ కలెక్షన్లుగా ఈ సినిమా నిలిచింది.
ఓజీ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. 2025 సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవల రిలీజైన కూలీ సినిమా రికార్డులను అధిగమించింది. టాలీవుడ్‌లోను, ఇండియన్ సినిమా రంగంలోను అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 4వ చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో టాప్ 5 ప్రీమియర్ల విషయానికి వస్తే.. కల్కి చిత్రం 3.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ 1 స్థానంలో ఉంది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన RRR 3.5 మిలియన్ డాలర్లు, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం 3.34 మిలియన్ డాలర్లు, దే కాల్ హిమ్ ఓజీ 3.14 మిలియన్ డాలర్లు, కూలీ చిత్రం 3.04 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యూఎస్‌లో తొలి రోజు కలెక్షన్లు
ఓజీ సినిమా అమెరికాలో తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం 534 లొకేషన్లలో 1455 షోల ద్వారా 11184 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ భారీగా స్పందన కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











