OG Overseas Collections: ఓవర్సీస్‌లో 100 కోట్లకు చేరువగా OG.. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కలెక్షన్లు ఎలా అంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతున్నది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించి ఈ సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్‌ను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

OG చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ బిజినెస్ 3 మిలియన్ డాలర్ల మేర జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 5 మిలియన్ డాలర్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 9 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

OG Overseas Box Office Collections

ఓవర్సీస్ బాక్సాఫీస్ గ్లోబల్ చార్ట్‌లో ఓజీ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. యూఏఈలో 7వ స్థానంలో, ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో, యూకేలో 9వ స్థానంలో, కెనడాలో 15వ స్థానంలో, అమెరికాలో 18వ స్థానంలో, న్యూజిలాండ్ 27 స్థానంలో కొనసాగుతున్నది.

నార్త్ అమెరికాలో ప్రీమియర్ల వరకే భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రీమియర్ షో ల ద్వారా 3.14 మిలియన్ డాలర్లు, తొలి రోజు 534K డాలర్లు, శుక్రవారం రెండో రోజు 533K డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి రెండు రోజుల్లో 4.2 మిలియన్ డాలర్లు అంటే.. 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీర సినిమాస్ వెల్లడించింది.

ఇక ఆస్ట్రేలియాలో కూడా రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు 332K ఆస్ట్రేలియా డాలర్లు, రెండో రోజు 126K ఆస్ట్రేలియా డాలర్లు, కడపటి సమాచారం ప్రకారం.. మూడో రోజు 58 వేల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 500K ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. న్యూజిలాండ్‌లో మూడు రోజుల్లో 225K డాలర్లు రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కలిపి 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక బ్రిటన్, ఐర్లాండ్‌లో కూడా OG సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రం యూకేలో 278609 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో 3.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐర్లాండ్‌లో 24 వేల పౌండ్లు అంటే.. అంటే 28 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే గల్ఫ్, సింగపూర్, ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం మొత్తంగా 8 మిలియన్ డాలర్లు అంటే.. 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

More from Filmibeat

Read more about: og pawan kalyan box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X