OG Overseas Collection: ఓవర్సీస్‌లో ఓజీ మేనియా.. ప్రీమియర్ షో కలెక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ విధ్వంసం
సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సెప్టెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్‌తోనూ మోత మోగించారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఓజీ కలెక్షన్స్‌పైనే నెలకొంది. ఏ సినిమా రికార్డులను పవన్ కళ్యాణ్ బద్ధలు కొట్టాడు? ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎన్ని కోట్లు? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఓవర్సీస్ కలెక్షన్ల పరంగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్లతో పాటు పవన్ కళ్యాణ్ ఛరిష్మా కారణంగా ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.
ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
ఓవర్సీస్‌లో ఓజీ ప్రభంజనం
ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. బాక్సాఫీస్ వద్ద ఓజీ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా అనేక రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మధ్యలోనే నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ సంస్థకు, థియేటర్ యాజమాన్యానికి వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పలు ఏరియాలలో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఓవర్సీస్‌లో ఓజీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ ఎంత రాబట్టింది? అనేది ఆసక్తికరంగా మారింది.
తొలి హీరోగా పవన్ రికార్డ్
అయితే నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీమియర్స్‌లోనే 3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 26 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టింది. తద్వారా ఇప్పటి వరకు ఏ భారతీయ నటుడు అందుకోని ఘనతను పవన్ కళ్యాణ్ అందుకుని చరిత్ర సృష్టించారు. ఇక ఓపెనింగ్ డేకు ప్రపంచవ్యాప్తంగా 98 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను ఒక్క అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే పవన్ రాబట్టాడు. ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే తొలి రోజు ఓజీ 160 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్ట వచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











