OG Worldwide Pre Business: OG వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? పవన్ కల్యాణ్ మూవీ టార్గెట్ ఎన్ని కోట్లు?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఓజాస్ గంభీరా (OG) అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు.
ఇక ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ.. షూటింగ్ దశ నుంచే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. గ్లింప్స్, ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది. అలాగే ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు భారీగా బిజినెస జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో టాక్‌గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 250 కోట్ల షేర్.. 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అనే ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. ఈ వివరాలను నిర్మాతకు సంబంధించిన వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











