OG USA Box Office: యూఎస్‌లో ఓజీ సరికొత్త రికార్డు.. రిలీజ్‌కు ముందే లాభాల్లోకి.. ఎన్ని కోట్ల కలెక్షన్లు అంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం దిశగా దూసుకెళ్తున్నది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో యువ దర్శకుడు సుజిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టేందుకు ఈ సిద్దమైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోను, అలాగే ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సినిమా తొలి రోజే ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సినిమా బిజినెస్, ఓవర్సీస్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
ఓజీ సినిమాకు సంబంధించి నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయలు, ఆంధ్రా, సీడెడ్ కలిపి 100 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ ఆంధ్రా, నైజాంలో వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రైట్స్ 8 కోట్ల రూపాయలు, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 7 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 26 కోట్ల రూపాయలు, ఇతర దేశాల రైట్స్ కలిపి 35 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే ఈ చిత్రం బిజినెస్ సుమారుగా 225 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఒక ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు ముగిసే నాటికకి, లేదా తొలి రోజు ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలిపారు. మంగళవారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం.. అమెరికాలో ఈ చిత్రం 2.1 మిలియన్ డాలర్లు అంటే 18 కోట్లో రూపాయలను సుమారుగా 466 లొకేషన్లలో, 2066 షోల ద్వారా రాబట్టినట్టు సమాచారం. ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి తొలి రోజు వసూళ్లు కలిపితే.. ఈ సినిమా 5 మిలియన్లకుపైగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, హిందీ, ఇతర రాష్ట్రాల బిజినెస్ పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా తొలి రోజు ముగిసే సమయానికి చేసిన బిజినెస్ నుంచి దాదాపు 50 శాతానికి పైగా రెవెన్యూను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అత్యధికంగా వసూళ్లను సాధించిన తెలుగు సినిమాల్లో ఓజీ కూడా చేరింది.
అయితే ఈ సినిమా రెండు రోజుల ముందుగానే ఓజీ బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపించింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పలు చోట్ల ఈ చిత్రం ఇటీవలీ సెన్సేషన్ పుష్ప 2 రికార్డును క్రాస్ చేసి.. తొలి రోజు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసే పనిలో ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











