»   » భాక్సాఫీస్ ‌:దసరా రిలీజ్ లలో విజేత ఈ సినిమానే

భాక్సాఫీస్ ‌:దసరా రిలీజ్ లలో విజేత ఈ సినిమానే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎప్పటిలాగే ఈ విజయదశమి తెలుగు సినీ ప్రేక్షకులకు కనుల విందు చేయడానికి సిద్ధమయ్యింది. ఈ సారి దసరా రోజున మూడు చిత్రాలు వెండితెరపై సందడి చేసాయి. మూడు ..మూడు రకాల విభిన్నమైన సబ్జెక్టులతో ఈ సినిమాలు రూపొంది మన ముందుకు వచ్చాయి. ఇంతకీ ఏం సినిమాలు అవి..వాటి భాక్సాఫీస్ పొజీషన్ ఏంటీ అంటే స్లైడ్ షో చూడాల్సిందే.

చిత్రాలు తప్పకుండా ఈ సారి ప్రేక్షక దేవుళ్లకు మృష్టాన్న భోజనం పెట్టనున్నాయి అని నిర్మాతలు ఆసక్తితో ముందుకు వచ్చారు. అందులోనూ దసరా పండుగ సందర్భంగా వచ్చే సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే దర్శక, నిర్మాతలు ఇలా రిలీజ్ లు ప్లాన్ చేసారు.


ఈ దసరాకు ... ఓంకార్ ‘రాజుగారి గది' , క్రిష్ ...కంచె చిత్రం, సుమంత్ అశ్విన్ చిత్రం కొలంబస్ లు రిలీజ్ అయ్యాయి. మూడు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మూడు సినిమాలూ తమ ట్రైలర్స్ తో ప్రేక్షకులను థియోటర్స్ వరకూ లాక్కెళ్లినవే. ఈ మూడింటిలో రెండు ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలు కాగా, కంచె మాత్రం హై బడ్జెట్ తో రూపొందింది.


స్లైడ్ షోలో...భాక్సాఫీస్ విజేత ఎవరనేది చూద్దాం...


కంచె

కంచె

ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం కూడా వచ్చింది. వరుణ్ తేజ హీరోగా వచ్చిన కంచె చిత్రం మేధావి వర్గం నుంచి బాగుందని ప్రశంసలు వస్తున్నా...రెగ్యులర్ ప్రేక్షకుడుకి పంటిక్రింద రాయి లాగ మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్లో నేరేషన్ చూసే వారికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అయితే ఎ, మల్టిఫ్లెక్స్ లలో ఈ చిత్రానికి మంచి ఆదరణ కనపడుతోంది.


కొలంబస్

కొలంబస్

ఇక ఎమ్.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా రమేష్ సామల అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ వచ్చిన కొలంబస్ చిత్రం పరమ రొటీన్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఓపినింగ్స్ సైతం సరిగా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నిలబడుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.


రాజుగారి గది...

రాజుగారి గది...

‘జీనియస్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది' అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు. అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయిన ఈ చిత్రం నిన్న రిలీజైన మూడు చిత్రాల్లో బెస్ట్ అనిపించుకుంది. భాక్సాఫీస్ వద్ద చెలరేగి,బి,సి సెంటర్లలలో డబ్బు తెస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కామెడీ, హర్రర్ డోస్ ఫెరఫెక్ట్ గా మిక్స్ కావటమే సినిమాకు కలిసి వచ్చిందంటున్నారు.


రుద్రమదేవి

రుద్రమదేవి

దసరా రోజున ..రుద్రమదేవి చిత్రం కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు దసరా అనుకూలంగా మారటం విశేషం.బ్రూస్ లీ

బ్రూస్ లీ

దసరా పండుగ ...బ్రూస్ లీకు ఎంతవరకూ కలిసి వస్తుందీ అంటే ఓ మాదిరి అని చెప్పాలి. వారం క్రిందట రిలీజైన ఈ చిత్రంకు మౌత్ టాకే దెబ్బతీసింది.ఫైనల్ గా

ఫైనల్ గా

ఫైనల్ గా దసరా విజేత రాజుగారి గది అని చెప్పాలి. ఈ కామెడీ హర్రర్ చిత్రం ...బడ్జెట్ కు నాలుగైదు రెట్లు పైగా డబ్బు తెస్తుందని అంచనా వేస్తున్నారు.English summary
Director Omkar's latest offing Raju Gari Gadi is getting good applause from B & C Centres.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu