పద్మావత్ కలెక్షన్ల దూకుడు.. 200 కోట్ల క్లబ్ వైపు.. శంకర్ ప్రశంసలు
Recommended Video

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ చిత్రం వివాదాల మధ్య కొనసాగుతునే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. కర్ణిసేన ఆందోళనల మధ్య ఈ చిత్రం మ్యాజిక్ చేస్తున్నది. జనవరి 25న రిలీజైన పద్మావత్ చిత్రం కలెక్షన్లపరంగా మంచి ఫలితాలను రాబడుతున్నది.

పద్మావత్ కలెక్షన్లు
పద్మావతి చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు మార్కును దాటింది. 2018లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలిచిత్రంగా రూపుదిద్దుకొన్నది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో త్వరలోనే చేరడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

శంకర్ ప్రశంసలు
ఇక పద్మావత్ చిత్రంపై సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రాన్ని దృశ్యకావ్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ కూడా ప్రశంసలతో ముంచెత్తారు.

మాటల్లో చెప్పలేను..
పద్మావతి చిత్రం అద్భుతంగా ఉంది. సన్నివేశాల చిత్రీకరణ తెర మీద అమోఘంగా ఉన్నాయి. సుదీప్, దీపికా, రణ్‌వీర్, సంజయ్ పనితీరు మాటల్లో చెప్పలేం. ఘూమార్ పాట ఆకట్టుకొన్నది అని శంకర్ ట్వీట్ చేశారు.

పద్మావత్ కథ ఇదే..
16వ శతాబ్దంలో ప్రముఖ కవి మాలిక్ మహమ్మద్ జయసీ రచించిన పద్మావతి కథ ఆధారంగా పద్మావత్ సినిమా రూపుదిద్దుకొన్నది. సతీ సహగమనానికి పాల్పడిన రాణి పద్మావతి కథే పద్మావత్ చిత్రం.


Click it and Unblock the Notifications











