twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak 10 days Collections: చరిత్ర సృష్టించిన పవన్.. అన్ని కోట్లతో టాప్ మూవీగా రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా ఎన్నో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించిన 'భీమ్లా నాయక్' ఒకటి. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే భారీ స్పందనను అందుకుంటూ కలెక్షన్లను రాబడుతోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం కలెక్షన్లు మరింతగా పెరిగాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ చూడండి!

    Recommended Video

    Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
    ప్రతీకార కథతో ‘భీమ్లా నాయక్’

    ప్రతీకార కథతో ‘భీమ్లా నాయక్’


    పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో ప్రతీకార కథతో తెరకెక్కిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

    హాట్ ఫొటోతో షాకిచ్చిన యాంకర్ విష్ణుప్రియ: వామ్మో ఆమెనిలా చూస్తే అస్సలు తట్టుకోలేరుహాట్ ఫొటోతో షాకిచ్చిన యాంకర్ విష్ణుప్రియ: వామ్మో ఆమెనిలా చూస్తే అస్సలు తట్టుకోలేరు

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    బడా మల్టీస్టారర్‌గా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    10వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    10వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    10వ రోజు ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. ఆదివారం రూ. 1.90 కోట్లు షేర్‌, రూ. 3 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనే: బట్టలు తీసేసి అలా పడుకుని దారుణంగా!హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనే: బట్టలు తీసేసి అలా పడుకుని దారుణంగా!

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్' 10 రోజుల్లో మంచిగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 34.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.38 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.88 కోట్లు, గుంటూరులో రూ. 5.10 కోట్లు, కృష్ణాలో రూ. 3.67 కోట్లు, నెల్లూరులో రూ. 2.48 కోట్లతో కలిపి రూ. 74.11 కోట్లు షేర్, రూ. 113 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    10 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 74.11 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.40 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 10 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 154 కోట్ల గ్రాస్ వచ్చింది.

    పాయల్ రాజ్‌పుత్ హాట్ వీడియో వైరల్: పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తూ!పాయల్ రాజ్‌పుత్ హాట్ వీడియో వైరల్: పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    విడుదలకు ముందే అంచనాలు ఏర్పరచుకున్న ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో రూ. 94.66 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 13.34 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    పవన్ కెరీర్‌లో సెస్సేషనల్ రికార్డ్

    పవన్ కెరీర్‌లో సెస్సేషనల్ రికార్డ్


    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 154 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది రికార్డును క్రియేట్ చేసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం ఇది రూ. 94.66 కోట్లు షేర్ రాబట్టి.. వంద కోట్ల క్లబ్‌కు కూడా చేరువ అయింది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie Collects Rs 94.66 Cr in 10 Days .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X