twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak Day 3 Collections: ఆదివారం భీమ్లా నాయక్ సెన్సేషన్.. 3 రోజుల్లోనే అన్ని కోట్ల వసూళ్లా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంది.. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న సినిమా 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచే మంచి టాక్‌ను అందుకున్న ఈ మూవీ.. కలెక్షన్లను కూడా అదిరిపోయే రీతిలో అందుకుంటూ దూసుకుపోతోంది.

    ఫలితంగా రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా దాటేసింది. అదే స్పీడును మూడో రోజు కూడా కంటిన్యూ చేసిందీ మూవీ. ఫలితంగా ఆదివారం ఈ చిత్రానికి వసూళ్లు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మూడు రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

     రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్'

    రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్'

    పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రివేంజ్ డ్రామాగా వచ్చిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

    భర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ: ఏకంగా బ్రాతో అతడి మీద పడుకుని రచ్చభర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ: ఏకంగా బ్రాతో అతడి మీద పడుకుని రచ్చ

     ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో పవన్ - రానా కలయికలో వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది.

    3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


    'భీమ్లా నాయక్'కు 3వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 6.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.49 కోట్లు, ఈస్ట్‌లో రూ. 91 లక్షలు, వెస్ట్‌లో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలతో కలిపి రూ. 13.51 కోట్లు షేర్, రూ. 21.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోతో యాంకర్ రష్మీ గౌతమ్ అరాచకం: జాకెట్ తీసేసి అందాలన్నీ కనిపించేలా!హాట్ షోతో యాంకర్ రష్మీ గౌతమ్ అరాచకం: జాకెట్ తీసేసి అందాలన్నీ కనిపించేలా!

    3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


    తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' మూడు రోజుల్లోనూ బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 25.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.66 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.60 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.91 కోట్లు, గుంటూరులో రూ. 3.88 కోట్లు, కృష్ణాలో రూ. 2.31 కోట్లు, నెల్లూరులో రూ. 1.81 కోట్లతో కలిపి రూ. 53.07 కోట్లు షేర్, రూ. 79.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


    ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 5307 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.02 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 108.50 కోట్ల గ్రాస్ వచ్చింది.

    <strong>ఆమెతో కలిసున్న ఫొటోతో షణ్ముఖ్ సర్‌ప్రైజ్: పాత రోజులు గుర్తు చేసేలా జంటగా!</strong><br />ఆమెతో కలిసున్న ఫొటోతో షణ్ముఖ్ సర్‌ప్రైజ్: పాత రోజులు గుర్తు చేసేలా జంటగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    భారీ అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో రూ. 69.19 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 38.81 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ చేరుతుంది.

    రెండు రికార్డులు కొట్టేసిన సినిమా

    రెండు రికార్డులు కొట్టేసిన సినిమా


    'భీమ్లా నాయక్' మూవీ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 53.07 కోట్లు రాబట్టింది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో యాభై కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఓవరాల్‌గా ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. వీటితో పాటు మరెన్నో రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie Collects Rs 69.19 Cr in 3 Days .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X