Don't Miss!
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Kushi Re Release collection: మొదటి రోజు కలెక్షన్ల సునామీ.. మరోసారి ట్రెండ్ సెట్ చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా మళ్లీ 20 ఏళ్ల తర్వాత విడుదలైనప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఖుషి 4K సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది అని మొదట ఎవరు అనుకోలేదు. ఇక రీ రిలీజ్ లో ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

న్యూ ఇయర్ హడావిడిలో
రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అగ్ర హీరోల అభిమానులు మరోసారి వారికి ఇష్టమైన సినిమాను థియేటర్లో చూడడానికి ఎగబడుతున్నారు. ఇక మొదట ఏదో ఒక లిమిటెడ్ థియేటర్లలో ఖుషి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ న్యూ ఇయర్ హడావిడిలో ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉండటంతో మళ్ళీ థియేటర్ల సంఖ్యను పెంచారు.

హిట్ కాంబినేషన్
పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలు అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఏఎమ్.రత్నం నిర్మించారు. ఇక సినిమాకు మణిశర్మ అందించిన పాటలు కూడా ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది.

నైజాం కలెక్షన్స్
అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 4K లో భారీగా విడుదల చేశారు. ఇక విడుదలైన అన్ని థియేటర్లలో కూడా మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇవ్వడం విశేషం. అసలు ఈ స్థాయిలో ఖుషి రీ రిలీజ్ కు రెస్పాన్స్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖుషి సినిమా నైజాం ఏరియాలో 1.65 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

టాప్ నైజాం మూవీస్
ఇంతకుముందు నైజాం ఏరియాలో టాప్ రీ రిలీజ్ మూవీస్ కలెక్షన్స్ వివరాలకి వెళితే.. ఖుషి 4K సినిమా 1.65 కోట్లను అందుకోగా జల్సా సినిమా 1.26 కోట్లను సొంతం చేసుకుంది. ఇక పోకిరి సినిమా 69 లక్షలు, బిల్లా సినిమా 32 లక్షలు, చెన్నకేశవరెడ్డి 21 లక్షలతో టాప్ లిస్టులో కొనసాగుతున్నాయి.

ఖుషి మొదటి రోజు కలెక్షన్స్
మొత్తంగా రీ రిలీజ్ మొదటి రోజు కలెక్షన్స్ లో అయితే ఖుషి సినిమా 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అయితే ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తో పాటు సినిమాలోని సరికొత్త స్టైల్ కూడా ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా ఆ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అర్థమయింది.

ఫస్ట్ డే రికార్డ్స్ లో నెంబర్ వన్ ఖుషి
తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో అయితే ఖుషి మొదటి స్థానంలో నిలిచింది. ఖుషి సినిమా మొదటి రోజు 3.15 కోట్లను పైగా కలెక్షన్స్ అందుకోగా.. ఇంతకు ముందు వచ్చిన జల్సా సినిమా 2.57 కోట్లను అందుకుంది. ఇక మహేష్ పోకిరి సినిమా 1.52 కోట్లు రాబట్టింది. బిల్లా సినిమా 25 లక్షలు, చెన్నకేశవరెడ్డి 64 లక్షలు, వర్షం 4k 15 లక్షల తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.