»   » జయ నేను ఒకే స్కూలు: సుమన్..., పవన్, మహేష్, బాలయ్య, వర్మ ఇలా!

జయ నేను ఒకే స్కూలు: సుమన్..., పవన్, మహేష్, బాలయ్య, వర్మ ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ సినీ నటి జయలలిత మరణం దేశం మొత్తాన్ని కదిలించింది. పలువురు సినీ ప్రముఖులు జయలలిత మరణంపై సంతాపం వ్యక్తం చేసారు. రజనీకాంత్, అమితాబ్ లాంటి స్టార్స్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసారు.

బాలకృష్ణ, మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ ఇంకా పలువురు స్టార్స్ సంతాపం వ్యక్తం చేసారు. మహేష్ బాబు స్పందిస్తూ జయలలిత మరణం దురదృష్టకరం. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి, మనోధైర్యం భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు, తమిళనాడు ప్రజలకు ఇవ్వాలని ప్రార్థించారు.

రామ్ గోపాల్ వర్మ

రాంగోపాల్‌ వర్మ 1991లో వెంకీ-శ్రీదేవి జంటగా తెరకెక్కించిన ‘క్షణక్షణం' సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు. ఆ అవార్డును జయలలిత చేతుల మీదుగా ఆయ‌న అందుకొన్నారు. తాను అమ్మ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాన‌ని వ‌ర్మ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను ఆయ‌న త‌న‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

అమ్మలేని తమిళనాడును ఊహించలేను

అమ్మ లేని తమిళనాడును ఊహించలేదు. సూపర్ స్టార్ టు సూపర్ పొలిటీషియన్. వావ్ వాట్ ఎ జర్నీ? అంటూ వర్మ ట్వీట్ చేసారు.

బ్యూటీ, గ్రేస్, డిగ్నిటీ

బ్యూటీ, గ్రేస్, డిగ్నిటీ కలగలిస్తే అమ్మ.... అంటూ వర్మ ట్వీట్.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జసేన పార్టీ తరపున ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆమె మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలందరితో పాటు తాను కూడా ఆశించానని... అయితే మనల్ని అందరినీ తీవ్ర దు:ఖంలో వదిలి, తిరిగిరాని లోకాలకు ఆమె వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా ఆమె బతికారని కొనియాడారు. తమిళ ప్రజలు ప్రేమతో 'అమ్మ'గా పిలుచుకునే జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సదా ఆచరణీయమని చెప్పారు. మహిళల ప్రబల శక్తికి జయలలిత నిదర్శనమని అన్నారు. అమ్మ మరణం తమిళనాడుకే కాకుండా... యావత్ దేశానికి తీరని లోటు అని చెప్పారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంతో క‌లిచి వేసింది. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌గారు త‌న‌దైన‌ ముద్ర వేశారు. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన జ‌య‌ల‌లితగారు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు. అలాగే అనేక స‌వాళ్ల‌తో కూడిన రాజ‌కీయాల్లో కూడా ముఖ్య‌మంత్రిగా ఆరు సార్లు ఎన్నిక కావ‌డం చాలా గొప్ప విష‌యం. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు, పోరాట శ‌క్తికి ఆమె నిద‌ర్శ‌నం. ఇటు వంటి లీడ‌ర్స్ అరుదుగా ఉంటారు. ఇటువంటి గొప్ప నాయ‌కురాలు మ‌న‌ల్ని విడిచిపెట్టి అనంత లోకాల‌కు వెళ్ల‌డం ఎంతో బాధాక‌రం. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం సినీ రంగానికే కాదు, రాజ‌కీయ రంగానికి కూడా తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను అని బాలయ్య తెలిపారు.

మోహన్ బాబు

మోహన్ బాబు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప అదృష్టంగా భావించాను. గొప్ప న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం త‌మిళ సోద‌రీ సోద‌రీమ‌ణుల‌కు తీర‌నిలోటు. ఆమె మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. మాట‌లు రావ‌డం లేదు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అని మోహన్ బాబు అన్నారు.

జయ నేను ఒకే స్కూలు

జయ నేను ఒకే స్కూలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సీనియర్ నటుడు సుమన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హాస్పటల్ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించినట్టు తెలిపారు. జయలలిత మహిళలకు మార్గదర్శి అని అన్నారు. ఆమె, నేను చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో చదివాం. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నపుడు జయలలిత సీనియర్. ఆమె షూటింగ్ లకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది అని సుమన్ గుర్తుచేసుకున్నారు. నటిగా కంటే మంచి డాన్సర్ గా జయలలిత ప్రసిద్ది. ఎలాంటి నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి జనామోదం పొందిన లీడర్ అయ్యారు. తమిళనాడులో జయలలిత పెట్టిన స్కీమ్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మ క్యాంటిన్ లో చవకధరకే ఇచ్చేవారు. ఆడపిల్లలు చదువులో ముందుండాలని ల్యాప్ ట్యాప్ లు ఇచ్చారు. మహిళలకు సైకిళ్ళు, గ్రైండర్స్ , ఫ్యాన్స్ అందజేశారు. ఆమె రాజకీయ జీవితంలో బ్లాక్ మెయిల్ కు ఆస్కారం లేదు. పార్టీలో ఒక స్కూల్ మాస్టర్ గా స్ట్రిక్ట్ గా వ్యవహించేవారు. ఆమెను చూస్తే సివంగి గుర్తుకువస్తుంది. నిర్ణయాలు వెంటనే తీసుకోవడం ఆమె ప్రత్యేకత. జయలలిత బయోగ్రఫీ చూస్తే ఎందరికో ప్రేరణ కలుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సుమన్ పేర్కొన్నారు.

English summary
"Deeply saddened at the loss of J Jayalalithaa garu. May her family and the whole of Tamil Nadu find strength at this time.." Mahesh babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu