OG AP TG Day 4 Box Office: 4 రోజుల్లో ఏపీ+తెలంగాణలో OG వసూళ్లు.. రికార్డ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సౌత్ ఇండియా, ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్నారు. లేటెస్ట్ గా పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా THEY CALL HIM OG చిత్రంతో వెండితెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ సీన్లు, డైలాగ్స్ తో థియేటర్లలో పవర్ స్టార్ తడాఖా చూపిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాగా ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఏపీ + తెలంగాణలో 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
OG బడ్జెట్ ఎంత?
ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. జాకీ ష్రాఫ్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొని OG సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్‌తో అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

OG ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ హైప్ ఉంటుంది. ఇక స్టైలిష్ లుక్ తో, గ్యాంగ్ స్టర్ నేపథ్యం ఉన్న కథతో రూపుదిద్దుకున్న OG చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ మెటీరియలతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా సినిమాకు వరల్డ్ వైడ్ గా ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్లకు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, నైజాంలో రూ.55 కోట్లు కలుపుకొని తెలుగు స్టేట్స్ లో రూ.157 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళ +కేరళ కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్ లో రూ.25.5 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.400 కోట్ల వరల్డ్ గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండింతులు లెక్క గట్టారు.
4 రోజుల్లో AP+TG వసూళ్లు..
ఓపెనింగ్ డే తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో వసూళ్లు అందాయి. ప్రీమియర్స్ + డే1 కలుపుకొని తొలిరోజు వసూళ్లు రూ.90 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ లెక్కలు తెలుపుతున్నాయి. ఇక 2వ రోజు రూ.19 కోట్లు, 3వ రోజు రూ.18 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాల లెక్కలు తెలుపుతున్నాయి. ఇలా 4 రోజుల్లో AP + TG వసూళ్లు రూ.142 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ రికార్డు..
తెలుగు స్టేట్స్ లో 2025లో 100 కోట్లకు పైగా డే1 గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ OG చిత్రంతో తొలిరోజే వరల్డ్ వైడ్ గా రూ.154 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకొని ఈ ఏడాది రికార్డ్ సెట్ చేశారు. ఇక AP + TGలో OG చిత్రం రూ.174 కోట్లు వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తవుతుందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. కాగా మరో రూ.35 కోట్లు వసూల్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక 4వ రోజు వరకు OG చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్ల మార్క్ ను దాటడం విశేషం.


Click it and Unblock the Notifications











