OG Day 7 Collections Worldwide: బాక్సాఫీస్ వద్ద ఓజీ సునామీ.. పవన్ కళ్యాణ్ మూవీ 7వ రోజు ఎన్ని కోట్లంటే?

OG Day 7 Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG (They Call Him OG)'బాక్సాఫీస్‌లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, థమన్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడంతో OG కొత్త రికార్డులను నెలకొల్పుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో OG సినిమా బడ్జెట్ ఎంత? ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు సాధించిందంటే..?

సినిమా బడ్జెట్
'OG'ని టాలీవుడ్ టాప్ బ్యానర్ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం కోసం సుమారు ₹250 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి నటించారు. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. టెక్నికల్ ఫ్రంట్‌లో సినిమాటోగ్రఫీ కోసం రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్‌లో నవీన్ నూలి, మ్యూజిక్‌లో ఎస్‌ఎస్ థమన్ కృషి చేశారు. భారీ సెట్‌లు, విదేశీ షెడ్యూల్స్, టెక్నికల్ టీమ్ రీమ్యునరేషన్లు కలిపి మొత్తం బడ్జెట్ రేంజ్ పెరిగింది.

Pawan Kalyan OG Movie Box Office in 7 Days Here is World Wide Latest Box Office collections

ప్రీ-రిజీస్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి రిలీజ్ కు ముందు భారీ బజ్ ఏర్పడింది. దీని కారణంగా OGకు ప్రీ-రిజీస్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయాయి. ఇందులో ఆంధ్ర రైట్స్ రూ. 80 కోట్లు, సీడెడ్ రూ. 22 కోట్లు, నైజాం రూ. 55 కోట్లు ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 157 కోట్లు ప్రీ-రిజీస్ బిజినెస్ పూర్తి అయ్యింది. ఇక కర్ణాటకలో రూ 8 కోట్లు, తమిళనాడు-కేరళలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 25.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ-రిజీస్ బిజినెస్ ₹194 కోట్లకు చేరింది. ఈ స్థితిలో సినిమాకు బ్రేక్ ఈవెన్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ షేర్‌గా ₹200 కోట్లు, అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు ₹400 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. సినిమాకు మంచి అంచనాలు, పాజిటివ్ రెస్పాన్స్ తో OG బాక్సాఫీస్‌ వద్ద దూసుకపోతూ.. నయా రికార్డులు సృష్టిస్తుంది.

బాక్సాఫీస్ వద్ద ఓజీ దూకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG (They Call Him OG)' రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు మొదటి పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రీమియర్ షోల వసూళ్లను మాత్రమే లెక్కిస్తే సుమారు రూ. 21 కోట్లు రాబట్టింది. సినిమా ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ పవర్‌ను చూపిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా రూ. 64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు ప్రేక్షకుల ఆకర్షణ కొనసాగిస్తూ రూ. 20 కోట్లు, మూడో రోజు రూ. 19 కోట్లు, నాల్గవ రోజు (ఆదివారం) కూడా అదే జోరును కొనసాగిస్తూ రూ. 18.5 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజు నుండి కలెక్షన్లు కొంత తగ్గాయి. ఐదో రోజు రూ. 7.5 కోట్లు, ఆరవ రోజు కూడా రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా, ఆరు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ వసూలు రూ. 155 కోట్లు, గ్రాస్ వసూలు రూ. 186 కోట్లుకి చేరింది.

ఓజీ ఏడో రోజు కలెక్షన్స్
ఇక ఓజీ 7 డే కలెక్షన్ వివరాలు వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG విడుదలైనప్పటి నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఆ తర్వాతి వర్కింగ్ డేస్‌లో పండుగ సీజన్ కూడా ఉండటంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడింది. ఇండియన్ థియేటర్లలో మధ్యాహ్నం 2 గంటల వరకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో 30%, తమిళ్‌లో 9%, హిందీలో 10% నమోదైంది. అయితే ఫస్ట్ షోలతో పోలిస్తే సెకండ్ షోలకు బుకింగ్స్ బాగా పెరిగాయి.

ట్రేడ్ అంచనాల ప్రకారం, ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోటి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ వెర్షన్లలో కలిపి రూ. 2.2 కోట్లు వసూలు చేశుందని భావిస్తున్నారు. ఈ కలెక్షన్లతో OG 7 రోజులలో ఇండియాలో రూ. 162 కోట్లు నెట్, రూ. 194 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఇప్పటికే రూ.280 కోట్ల దాక చేరే దిశగా ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేసినట్టే, త్వరలో సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటే అవకాశముంది. ఫస్ట్ వీక్ వసూలు, పండుగ సీజన్, పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, థమన్ మ్యూజిక్ కలిపి ఓజీని బాక్సాఫీస్‌లో సూపర్ హిట్‌గా నిలిపాయి.

More from Filmibeat

Read more about: og pawan kalyan box office reprot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X