»   » మరో రికార్డ్ : పవన్-త్రివిక్రమ్ చిత్రం శాటిలైట్ రేట్

మరో రికార్డ్ : పవన్-త్రివిక్రమ్ చిత్రం శాటిలైట్ రేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందిన సమాచారం ప్రకారం మా టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారు. తొమ్మిది కోట్లు ఈ రైట్స్ నిమిత్తం చెల్లించటానికి ఎగ్రిమెంట్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ రేట్ విన్నవారు షాక్ అవుతున్నారు. ఓ పెద్ద హీరో చిత్రం బడ్జెట్ అంత...ఈ శాటిలైట్ రైట్స్ వచ్చాయని,ప్రొడ్యూసర్ ఫుల్ ఖుషీ అని అంటున్నారు.

ముఖ్యంగా పవన్ చిత్రాలకు విపరీతమైన టీఆర్పీ ...వస్తూంటుంది. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కావటం..ఫ్యామిలీ చిత్రం అని టాక్ రావటం...సమంత హీరోయిన్ కావటం ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాద్షా చిత్రాలకు శాటిలైట్ ఏడు కోట్లు వచ్చింది.

చిత్రం లేటెస్ట్ ఇన్ఫో కి వస్తే... త్వరలో యూరప్ ..పవన్ కళ్యాణ్ హంగామా చేయనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 20 రోజుల భారీ షెడ్యూల్ నిమిత్తం ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ యూరప్ బయలుదేరింది.

అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


ఆ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే... అధికారికంగా మాత్రం ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదు.

మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary

 Pawan-Trivikram film Attarintiki Daredi satellite rights were sold out to MAA TV for a record price. According to reliable sources Attarintiki Daredi producer BVSN Prasad got paid 9 Crores for its television rights, which broke SVSC & Baadshah satellite rights cost of nearly 7 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu