OG Day 10 Collections Worldwide: కొనసాగుతున్న ఓజీ దండయాత్ర.. పవన్ కళ్యాణ్ మూవీకి 10వ రోజు ఎన్ని కోట్లంటే?
Pawan Kalyan OG Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన OG (They Call Him OG) సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సెన్సేషన్‌గా మారింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్టైల్, డైలాగ్స్, థమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి సినిమాను బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో నిలిపాయి. ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు అందరూ థియేటర్స్‌కి వచ్చి "పవర్ స్టార్ రాకింగ్ రిటర్న్" అని జోరుగా చెబుతున్నారు. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు ? 10 వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఓజీ. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను టాలీవుడ్ టాప్ బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత డీవీవీ దానయ్య సుమారు ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్‌కి పాన్ ఇండియా లుక్ ఇచ్చింది. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో మెరిశారు.
ఇక ఈ సినిమాకు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. విశాలమైన సెట్స్, విదేశీ షెడ్యూల్స్, టెక్నికల్ టీమ్‌ల భారీ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ కలసి ఈ సినిమా బడ్జెట్‌ను భారీ స్థాయిలోకి తీసుకెళ్లాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ అవతారం, సుజీత్ స్టైలిష్ టేకింగ్, థమన్ థండరస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాన్ ఇండియా స్టార్స్‌తో పవర్‌ప్యాక్ కాంబినేషన్ అని కలిపి సినిమాకు హైలెట్ గా మారాయి.

ప్రీ-రిజీస్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబో ప్రకటనతో OG సినిమా రిలీజ్‌కి ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆ హైప్ ప్రభావం ఓజీ ప్రీ-రిజీస్ బిజినెస్‌లో స్పష్టంగా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఆంధ్ర రైట్స్ రూ.80 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.22 కోట్లు, నైజాం రైట్స్ రూ.55 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.157 కోట్ల బిజినెస్ జరిగింది.
ఇతర ఏరియాస్‌లో కూడా డీల్‌లు భారీగానే క్లోజ్ అయ్యాయి. కర్ణాటక రైట్స్ రూ.8 కోట్లు, తమిళనాడు, కేరళ రైట్స్ రూ.3 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.25.5 కోట్లు దాకా అమ్ముడయ్యాయి. మొత్తం కలిపి OG సినిమా ప్రీ-రిజీస్ బిజినెస్ దాదాపు రూ.194 కోట్లు దాటింది. ఈ స్థాయిలో డీల్‌లు క్లోజ్ కావడం పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మార్కెట్ ఎంత పెరిగిందో చూపిస్తోంది. ఇక డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ కావాలంటే షేర్‌గా కనీసం రూ.200 కోట్లు సాధించాలి. అంటే వరల్డ్‌వైడ్‌గా సినిమా గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ.400 కోట్లకు పైగా రావాలి.
దుమ్మురేపుతోన్న ఓజీ కలెక్షన్స్
ఓజీ (They Call Him OG)'బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో OG కలెక్షన్లు సూపర్‌స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారానే రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలి రోజు రూ.67 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు, ఐదో రోజు రూ.7.5 కోట్లు, ఆరో రోజు రూ.7 కోట్లు, ఏడో రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ.7.5 కోట్లు, తొమ్మిదో రోజు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. దీంతో తొమ్మిది రోజులలోనే OG మొత్తం రూ.175 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఓజీ పదో రోజు కలెక్షన్స్ లో కాస్త జోరు కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 10 వ రోజు OG కలెక్షన్లు జోరుగా కొనసాగాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర భాషల్లో కలిపి రూ.5 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పది రోజులలోనే ఓజీ మొత్తం రూ.179.5 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. అలాగే.. ఓవర్సీస్‌లో కూడా ఓజీ కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 6.5 మిలియన్ల డాలర్లకు (రూ.50 కోట్లకు పైగా) చేరువలో ఉంది. మిగతా దేశాలతో కలిపితే 7 మిలియన్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.170 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.66 కోట్లు కలిపి OG మొత్తం రూ.280 కోట్లు రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక భారీ మైలురాయిగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











