OG Day 11 Collections Worldwide: బాక్సాఫీస్‌పై పవన్ తుపాన్.. ఓజీ మూవీకి 11 వ రోజు ఎన్ని కోట్లంటే?

Pawan Kalyan OG Collection: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఓజీ'(They Call Him OG). ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన రోజే ఈ చిత్రం సోషల్ మీడియా, థియేటర్స్, ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్‌గా మారింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్, థమన్ అందించిన థండరస్ మ్యూజిక్ - ఇవన్నీ కలిసి "OG"ని బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో నిలబెట్టాయి. థియేటర్ల వద్ద పవర్ స్టార్ అభిమానులు జెర్సీలు, బ్యానర్లు, కేకలతో ఊపిరి పీల్చుకోనంత ఫెస్టివ్ మూడ్ కనిపిస్తోంది. "ఇది పవర్ స్టార్ రాకింగ్ రిటర్న్!" ఫ్యాన్స్ ఒకే మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 11 రోజుల్లో ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసింది? బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయాలి? వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్‌ మాస్ యాక్షన్ ఫిల్మ్

"OG" పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. టాలీవుడ్ టాప్ బ్యానర్ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత DVV దానయ్య ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని సుమారు ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. టెక్నికల్ టీమ్, నటీనటులను చూస్తేనే ఓజీ రేంజ్ అర్థమవుతుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమయి వంటి టాప్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస సంయుక్తంగా అందించగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చేపట్టారు. సంగీతం ఎస్‌.ఎస్‌. థమన్, యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరించబడ్డాయి. విదేశీ షెడ్యూల్స్‌, విశాలమైన సెట్స్‌, భారీ రిమ్యూనరేషన్స్‌ ఇవన్నీ కలిసి ఓజీ ని నిజమైన పాన్ ఇండియా స్పెక్టకిల్ గా నిలబెట్టాయి.

Pawan Kalyan s OG Box Office Collection 11 Days Here is World Wide Latest Box Office collections

ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డులు
ఓజీ "OG" సినిమా రిలీజ్‌కి ముందే పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్ మీద గల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలే ప్రీ-రిజీస్ బిజినెస్‌లో ప్రతిబింబించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆంధ్ర రైట్స్ రూ. 80 కోట్లు, సీడెడ్ ఏరియా రూ. 22 కోట్లు, నైజాం ఏరియా రూ. 55 కోట్లు ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ. 157 కోట్ల ప్రీ-రిజీస్ బిజినెస్ జరిగింది. ఇతర ఏరియాస్‌లో కూడా ఫిగర్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. కర్ణాటక రైట్స్ రూ. 8 కోట్లు, తతమిళనాడు, కేరళ రైట్స్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 25.5 కోట్లు.. ఇలా మొత్తం కలిపి ఓజీ సినిమా ప్రీ-రిజీస్ బిజినెస్ దాదాపు ₹194 కోట్లు దాటింది. ఇంత భారీ స్థాయిలో డీల్స్ క్లోజ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దదే. OG సినిమా థియేట్రికల్ షేర్‌గా కనీసం ₹200 కోట్లు సాధిస్తేనే పూర్తి రికవరీ అవుతుంది. అంటే వరల్డ్‌వైడ్‌గా గ్రాస్ కలెక్షన్స్ ₹400 కోట్లకు పైగా రావాల్సిన అవసరం ఉంది.

దుమ్మురేపుతోన్న ఓజీ కలెక్షన్స్
ఓజీ (They Call Him OG)'బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో OG కలెక్షన్లు సూపర్‌స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారానే రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలి రోజు రూ.67 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు, ఐదో రోజు రూ.7.5 కోట్లు, ఆరో రోజు రూ.7 కోట్లు, ఏడో రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ.7.5 కోట్లు రాబడింది. దీంతో ఓజీ మొదటి వారంలో రూ. 169.3 కోట్ల (నెట్) కలెక్ట్ చేసింది.

ఇక కాంతార మూవీ రిలీజ్ కావడంతో ఓజీ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం పడింది. దీంతో తొమ్మిదో రోజు రూ. 4.75 కోట్లు వసూలు చేయగా.. పదో రోజు రూ. 4.6 కోట్లు చేసింది. దీంతో ఓజీ సినిమా పది రోజులలో మొత్తం రూ.179 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఇక 11 వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్ కాస్త జోరు కనిపిస్తోంది. దీంతో 11 వ రోజు రూ. 4.35 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓజీ 11 రోజుల్లో ఇండియా వైడ్ గా రూ. 183 కోట్లు వసూలు చేసింది. అలాగే.. ఓవర్సీస్‌లో కూడా ఓజీ కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 6.7 మిలియన్ల డాలర్లకు (రూ.50 కోట్లకు పైగా) చేరువలో ఉంది. మిగతా దేశాలతో కలిపితే 7.2 మిలియన్లకు పైగా వసూలు చేసింది.

ఇక తెలుగు బ్యాక్సాఫీస్ వద్ద ఓజీ దుమ్ము రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 128 కోట్ల షేర్ (రూ. 192 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రూ.31 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.66.5 కోట్లు కలిపి OG మొత్తం రూ.290 కోట్లు ( గ్రాస్) రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక భారీ మైలురాయిగా నిలుస్తోంది. గత వారం విడుదలైన 'కాంతార' పోటీ మధ్య కూడా "ఓజీ" వసూళ్లు తగ్గలేదు. పవన్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ డేలోనే ₹100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, పవన్ కెరీర్‌లో తొలి 100Cr ఓపెనర్‌గా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్ చేరువగా ఉండి, 2025లో పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

More from Filmibeat

Read more about: og pawan kalyan box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X