OG Day 9 Collections Worldwide: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న పవన్ కళ్యాణ్.. ఓజీ 9వ రోజు ఎన్ని కోట్లంటే?
Pawan Kalyan OG Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ OG (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్టైల్, స్ట్రైట్ఫార్వర్డ్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్, అలాగే థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులనుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో, OG బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు? 9 వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్
ఓజీ సినిమాను టాలీవుడ్ టాప్ బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత డీవీవీ దానయ్య సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి పనిచేయడం మరో విశేషం. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ కోసం రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్ కోసం నవీన్ నూలి, మ్యూజిక్‌లో ఎస్‌ఎస్ థమన్ కృషి చేశారు. భారీ సెట్స్, విదేశీ షెడ్యూల్స్, టెక్నికల్ టీమ్ రెమ్యూనరేషన్స్ కలిసి ఈ సినిమా బడ్జెట్ భారీ స్థాయిలో పెరగడానికి కారణమయ్యాయి.

ప్రీ-రిజీస్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి OGకి రిలీజ్‌కి ముందే భారీ హైప్ ఏర్పడింది. దాని ప్రభావం ప్రీ-రిజీస్ బిజినెస్ మీద స్పష్టంగా కనిపించింది. ఇలా ఆంధ్ర రైట్స్ రూ. 80 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 22 కోట్లు, నైజాం రైట్స్ రూ. 55 కోట్లు, ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 157 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఇతర ఏరియాస్‌లో కర్ణాటక రూ. 8 కోట్లు, తమిళనాడు, కేరళ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 25.5 కోట్లు.. ఇలా మొత్తం ప్రీ-రిజీస్ బిజినెస్ సుమారు రూ. 194 కోట్లు దాటింది. ఈ స్థితిలో డిస్ట్రిబ్యూటర్స్ బ్రేక్ ఈవెన్ కావాలంటే, షేర్‌గా రూ. 200 కోట్లు అంటే వరల్డ్‌వైడ్‌గా గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ. 400 కోట్లు సాధించాల్సి ఉంటుంది.
వసూళ్ల రేసులో దూసుకుపోతున్న ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG (They Call Him OG)' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో OG కలెక్షన్లు సూపర్‌స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారానే రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలి రోజు రూ.67 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు, ఐదో రోజు రూ.7.5 కోట్లు, ఆరో రోజు రూ.7 కోట్లు, ఏడో రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ.7.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఎనిమిది రోజులలోనే OG మొత్తం రూ.170 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక ప్రాంతాల వారిగా చూస్తే, నైజాంలో 46 కోట్లు, సీడెడ్‌లో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 12 కోట్లు, పశ్చిమ గోదావరిలో 8 కోట్లు, గుంటూరులో 10.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 9 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లు వసూలు అయ్యాయి. తెలుగేతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా మిక్స్డ్ రిజల్ట్స్ అందుకుంది. కర్ణాటకలో 18 కోట్లు, తమిళనాడులో 4 కోట్లు, కేరళలో 50 లక్షలు, హిందీ & ఇతర ప్రాంతాల్లో రూ. 6 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తం మీద తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్లు రూ.28.5 కోట్లకు చేరాయి. కర్ణాటక మినహా మిగతా మార్కెట్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్టు ట్రేడ్ టాక్.
ఓవర్సీస్‌లో మాత్రం OG కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 6 మిలియన్ల డాలర్లకు (రూ.50 కోట్లకు పైగా) చేరువలో ఉంది. మిగతా దేశాలతో కలిపితే 7 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇలా వారం రోజులు గడిచినా కూడా ఓవర్సీస్‌లో స్థిరంగా వసూళ్లు సాధిస్తోంది. మొత్తం వరల్డ్ వైడ్ 8 రోజుల వసూళ్లు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో రూ.168 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.65 కోట్లు కలిపి OG మొత్తం రూ.265 కోట్లను రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక భారీ మైలురాయిగా నిలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 9వ రోజుకూడా OG కలెక్షన్లు కొనసాగుతాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఇతర భాషల్లో కలిపి రూ.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.6.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమా మొత్తం రూ.272 కోట్ల వద్దకు చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఓజీ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, థియేటర్లలో అభిమానుల హంగామా అన్ని కలిపి ఓజీ (OG)ని భారీ రేంజ్‌లో ముందుకు నెడుతున్నాయి. వసూళ్ల పరంగా ఇప్పటికే అనేక రికార్డులను బద్దలుకొట్టిన ఓజీ, వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త మైలురాళ్లను చేరుకునే దిశగా పయనిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా వచ్చే రోజుల్లోనూ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తే, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సులభంగా చేరుకుని, పవన్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











