Pawan Kalyan's OG: నార్త్‌లో పవన్ కళ్యాణ్ మేనియా.. రికార్డ్ ధరకు ఓజీ రైట్స్, ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి ఓజీ. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ల, ఫస్ట్ లుక్, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా కళ్లు చెదిరే బిజినెస్ చేస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ సినిమా బడ్జెట్ ఎంత?
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

సెప్టెంబర్ 25న ఓజీ
సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ తాను గతంలో కమిటైన ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తున్న పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఓజీపై పడ్డాయి. ఓజీ షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేశారు పవన్. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెరపై పవన్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కన్మణిగా ప్రియాంక మోహన్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్, ఇటీవల హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను, ఆమె పాత్ర పేరును రివీల్ చేశారు. ఇందులో ఆమె కన్మణి అనే రోల్ పోషిస్తున్నారు. చీరకట్టులో, మెడలో నల్లపూసల దండ, నుదిటిన కుంకమతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు ప్రియంక. హోమ్లీ లుక్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. పవన్ పాత్రను తుఫానుతో పోల్చిన మేకర్స్.. ఏ తుఫానుకైనా ప్రశాంతత అవసరమనే క్యాప్షన్‌తో ప్రియాంక ఫోటోను రిలీజ్ చేశారు.
ఓజీ శాటిలైట్ రైట్స్‌కు రికార్డ్ ధర
కాగా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఓజీకి తెలుగుతో పాటు నార్త్ జనాలు కూడా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. నార్త్‌లో సహజంగానే గ్యాంగ్‌స్టర్ డ్రామాలకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఓజీ రైట్స్ కోసం ఉత్తరాదికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఓజీ శాటిలైట్ రైట్స్‌కి కళ్లు చెదిరే ధర దక్కినట్లుగా తెలుస్తోంది. పలు టాప్ ఛానెల్స్ ఇందుకోసం పోటీపడగా ఫ్యాన్సీ రేటుకు స్టార్ గోల్డ్ ఛానెల్ ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం బయటకు రాలేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో రేటు దక్కలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











