500000 రూపాయలకు OG టికెట్.. పవన్ కల్యాణ్‌పై కొండంత అభిమానంతో కొనుగోలు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినాన్ని అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. తమ అభిమాన కథానాయకుడు, రాజకీయ నేతపై పలు రకాలుగా అభిమానాన్ని చూపిస్తున్నారు. కొందరు పాలాభిషేకం, మరికొందరు రక్తదానం, ప్రజలతో మమేకమైన సేవా కార్యక్రమంలో భాగమవుతున్నారు. అయితే తాజాగా పవన్ నటించిన OG మూవీపై ఓ అభిమాని తన ప్రేమను చాటుకొన్నారు. పవర్ స్టార్ జన్మదినం సందర్భంగా అభిమాని చేసిన హల్‌చల్ ఏమిటనే విషయంలోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Pawan Kalyan s OG Cinema

సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే భారీగా బిజినెస్ చేసుకొన్నది. ఓవర్సీస్ మార్కెట్ ముఖ్యంగా అమెరికాలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన రావడంతోపాటు 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు చేరువైంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నది. తెలుగు రాష్ట్రాల్లోను, ఇండియా వైడ్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

అయితే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభానికి ముందే.. అమెరికాలోని టీమ్ పవన్ కల్యాణ్ గ్రూప్‌కు చెందిన ఓ అభిమాని OG సినిమా టికెట్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేశాడు. ఈ సినిమా మొదటి టికెట్‌ను 5 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నాడు. ఈ మొతాన్ని జనసేన పార్టీకి ఫండ్‌గా ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇలా పవర్ స్టార్‌పై అభిమానాన్ని చాటుకొంటూ పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగమయ్యాడు. ఈ విషయంతో పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై ఉన్న క్రేజ్, అభిమానం మరోసారి ఫ్యాన్స్‌లో స్పష్టమైంది అని నెటిజన్లు చెప్పుకొంటున్నారు.

ఇదిలా ఉండగా, నార్త్ అమెరికాలో ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సినిమా వేగంగా 900K కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ చిత్రంగా రికార్డు క్రియేట్ అయింది. పవన్ కల్యాణ్ సినిమా మెరుపు వేగంతో ఈ రికార్డును సొంతం చేసుకొన్నది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. సిద్దంగా ఉండండి అంటూ అమెరికాలో ఈ సినిమాను డిస్టిబ్యూట్ చేస్తున్న ప్రత్యాంగీర సినిమాస్ ట్వీట్ చేసింది. ఈ చిత్రం ఇదే వేగంతో కలెక్షన్లు సాధిస్తే.. ప్రీమియర్ల నాటికి ఓవర్సీస్ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం. ఇక ఈ చిత్రం భారీ రికార్డులు క్రియేట్ చేయడం తథ్యం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og north america
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X