OG 17 Days Box Office: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ఓజీ.. 17 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

OG Box Office Collections Worldwide: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ (They Call Him OG)' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ మాస్ అటిట్యూడ్‌, సుజీత్ దర్శకత్వం, థమన్ థండరింగ్ మ్యూజిక్.. ఇవన్నీ కలిసి థియేటర్లలో పండుగ వాతావరణం సృష్టించాయి. సోషల్ మీడియాలోనూ పవర్ స్టార్ ఓజీ స్టామీనా ఏంటో రుజువైంది. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్లు, రోజు వారి కలెక్షన్లు ? 17 వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

'ఓజీ'ని DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే కాకుండా ఈ ఏడాది టాలీవుడ్ చరిత్రలో భారీ కలెక్షన్స్ రాబడిన మూవీగా ఓజీ నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్ లుక్ కనిపిస్తూ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుంది. సినిమాటోగ్రాఫర్స్ రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల హర్షధ్వానాలు తెచ్చాయి. పవన్‌తో పాటు బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్‌, ప్రకాశ్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Pawan Kalyan s OG Day 17 Expected Box Office Collections On Verge of Breaking Even Worldwide

పవన్ సుజీత్ కాంబోలో ఈ మూవీ రాయడంతో విడుదలకి ముందే ఈ సినిమాపై ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ హైప్ నెలకొంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.194 కోట్లను దాటేసింది. పూర్తి రికవరీ కోసం కనీసం రూ.200 కోట్ల థియేట్రికల్ షేర్ అవసరమని ట్రేడ్ టాక్. వ‌రల్డ్‌వైడ్ గ్రాస్ టార్గెట్‌గా రూ.400 కోట్లు పెట్టుకున్నారు. విడుదలైన తొలి షో నుంచే 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫస్ట్ డే నుంచే పవన్ మానియా తారాస్థాయికి చేరింది. ప్రీమియర్స్ ద్వారానే రూ.22 కోట్లు రాబట్టిన సినిమా, మొదటి రోజు రూ.67 కోట్లు రాబట్టి క్రియేట్ చేసింది.

ఇక ఓజీ మూవీ రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం మొత్తంగా ఇండియా వైడ్ నెట్ రూ.169.3 కోట్లు వసూలు చేసింది. కాంతార సినిమా రీ-రిలీజ్ కారణంగా స్పీడ్ కాస్త తగ్గినా, పవన్ మాస్ పవర్ తగ్గలేదు. తొమ్మిదో రోజు రూ.4.75 కోట్లు, పదో రోజు రూ.4.6 కోట్లు, పదకొండవ రోజు రూ.4.35 కోట్లు, పన్నెండవ రోజు రూ.2 కోట్లు, పదమూడవ రోజు రూ.1.8 కోట్లు, పద్నాలుగో రోజు రూ.1.18 కోట్లు, పదిహేనో రోజు రూ.1 కోటి వసూలు చేసింది. ఇలా రెండు వారాల్లో ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ రూ.188 కోట్లు, గ్రాస్ రూ.226 కోట్లు, వ‌రల్డ్‌వైడ్ గ్రాస్ రూ.316 కోట్లకు చేరింది.

17వ రోజు కలెక్షన్ రిపోర్ట్
ఇక ఓజీ 17వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 16 రోజు నేషనల్ వైడ్ గా 0.90 కోట్లు ( నెట్) వసూలు చేయగా.. నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగాయి. ఓజీ 17 వ రోజు ఇండియా వైడ్‌గా రూ. 1.2 కోట్ల నెట్, రూ. 1.42 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.40 కోట్ల నెట్ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూ. 2.2 కోట్లు చేరిందని అంచనా.

దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ. 191 కోట్లు (నెట్), రూ.230 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.321 కోట్ల మార్క్‌ చేరువ కానున్నట్టు అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. నేటి నుంచి వీకెండ్ మొదలు కావడంతో ఓజీ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా.. పవన్ కెరీర్ లో ఓజీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓజీ రికార్డు క్రియేట్ చేస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్‌, థమన్ మ్యూజిక్‌, సుజీత్ ట్రీట్‌మెంట్‌ కలిసి పవర్ స్టార్ కెరీర్‌లో ఓజీ ఓ మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి.

More from Filmibeat

Read more about: pawan kalyan og box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X