For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కెమెరామేన్ గంగతో రాంబాబు' బిజినెస్ రికార్డు

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం బిజినెస్ మొన్న అల్లు అరవింద్ నైజాం తీసుకోవటంతో ఓ రేంజిలో మొదలైంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి రైట్స్ ని ఆర్.ఆర్.ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండున్నర కోట్లు ఈ ఏరియో కోసం వారు ఇస్తున్నట్లుగా ట్రేడ్ లో వినపడుతోంది. ఈ మొత్తం ఆ ఏరియాకి పెద్ద రికార్డే.

  ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచీ బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందులోనూ గబ్బర్ సింగ్ చిత్రం యాభై రోజులకే అరవై మూడు కోట్లు వసూలు చేయటంతో ఆ ఎఫెక్టు ఈ తాజా చిత్రంపై పడనుంది. ఈ నేఫద్యంలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తెలుగులో పాటు,తమిళ,మళయాళ భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని దర్సక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు డబ్బింగ్,మిగతా పనులును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మూడు భాషల్లో విడుదల అవుతున్న పవన్ చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి ఇదో రికార్డు.

  ఇక ఈ చిత్రం పద్మాలయా స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారి సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. మొన్నటివరకూ సారధిలో వేసిన మెకానిక్ షెడ్ లో సీన్స్ పూర్తి చేసారు.

  'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

  English summary
  Pawan Kalyan’s much awaited movie ‘Cameraman Gangatho Rambabu’ is progressing at a brisk pace as it is being handled by Puri Jagannath. As per the latest reports, R.R.Film Distributors have bought the film distribution rights for East Godavari area by fetching a fancy price of around Rs.2.50 crores, which is highest for any movie in the area. Tamanna is playing Pawan’s lady love in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X