»   »  నితిన్ ది ఫెరఫెక్ట్ ఐడియా... ఈ సారి పవన్ పేరు చెప్పి కోట్లు సంపాదిస్తాడు

నితిన్ ది ఫెరఫెక్ట్ ఐడియా... ఈ సారి పవన్ పేరు చెప్పి కోట్లు సంపాదిస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నితిన్ కు, పవన్ కు ఉన్న అనుబంధం తెలిసిందే. ఓ అభిమానిగా పవన్ ని నితిన్ ఆరాధిస్తే...ఓ తమ్ముడుగా చూసుకుంటారు పవన్. ఈ నేపధ్యంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు హీరో నితిన్‌ తెలిపారు.

ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. ఆసియన్‌ ఫిల్మ్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ కలిసి పవర్‌స్టార్‌ 'కాటమరాయుడు' సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఇక 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ ఫిబ్రవరి 4న విడుదల చేసిన ఈ టీజర్‌ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. దాంతో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు అంతటా ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో పవన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా నితిన్ కు ఈ సినిమా లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో 'రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

Pawan's Katamarayudu: Nithiin clinches Nizam distribution rights

కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ . శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఉగాదికి 'కాటమరాయుడు' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
“THRILLED to announce that Asian films and Sreshth movies will be distributing POWERSTAR’S KAATAMARAYUDU for Nizam area,” posted Nithiin on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu