Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ రెండు ఫట్.. మూడు క్రేజీ హిట్.. బాలయ్య, చెర్రీ, రజనీ, వెంకీ, అజిత్ బాక్సాఫీస్ రిపోర్టు!
సంక్రాంతి బరిలో దక్షిణా సూపర్ స్టార్ హీరోలు భారీగానే పోటీ పడ్డారు. ఈ ఏడాది ఆరంభంలోనే రజనీకాంత్, అజిత్ కుమార్, బాలకృష్ణ, రాంచరణ్, వెంకటేష్ లాంటి హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. వీరు నటించిన పేటా, విశ్వాసం, ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయాయి. అవేమిటంటే..

ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు
తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో రూ.70 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రానికి సినీ ప్రముఖలు సానుకూలంగా స్పందించారు. అయితే గత పది రోజుల్లో ఈ చిత్రం రూ.20 కోట్లు మాత్రమే సాధించగలిగినట్టు ట్రేడ్ రిపోర్డు. దాదాపు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్లకు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

రజనీకాంత్ పేట కలెక్షన్ల గురించి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజైంది. ఈ చిత్రం హక్కులు రూ.110 కోట్లకు అమ్ముడుపోయాయి. గత 10 రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.200 కోట్ల గ్రాస్, (రూ.100 కోట్లకుపైగా షేర్) వసూళ్లను సాధించింది. ఇంకా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చినట్టు ట్రేడ్ రిపోర్టు. కానీ తెలుగులో ఈ చిత్రానికి అంతగా వసూళ్లు కనిపించడం లేదు.

వినయ విధేయ రామ వసూళ్లు
ఇదే రేసులో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ విడుదలైంది. సినిమా సెకండాఫ్ నాసిరకంగా ఉండటంతో తొలి ఆట నుంచి ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హక్కులను రూ.85 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ రిపోర్టు. అయితే గత పది రోజుల్లో సుమారు. రూ.80 కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది. దాంతో ఈ సినిమా బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

విశ్వాసం సినిమా వసూళ్లు
ఇక అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సంక్రాంతి బరిలోకి అండర్ డాగ్‌గా వచ్చింది. ఈ చిత్రం హక్కులను రూ.82 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ రిపోర్టు. ఈ సినిమాపై యావరేజ్ రిపోర్టు వచ్చినా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ చిత్రం గత పది రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ (రూ.100 కోట్ల షేర్)ను సాధించినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.

వెంకీ మూవీ ఎఫ్2 బ్లాక్ బస్టర్
సంక్రాంతి బరిలో దూకిన ఎఫ్2 సినిమా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో మల్టీస్టారర్‌గా రూపొందింది. ఈ సినిమా హక్కులను రూ.32 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యమైన వసూళ్లను సాధిస్తున్నది. తొలివారంలోనే రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ పండుగ రేసులో బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.