For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2012- తెలుగు ప్లాప్స్... సూపర్ ప్లాప్స్ (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 2012లో తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకూ దాదాపు 150 సినిమాలు పైగా విడుదల అయ్యాయి. అందులో 47 డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. మరో పది స్టైయిట్ చిత్రాలు, మూడు దాకా డబ్బింగ్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. డబ్బింగ్ చిత్రాలును ప్రక్కన పెడితే... టాలీవుడ్ ఇప్పటివరకూ 117 చిత్రాలు నిర్మించింది. గత సంవత్సరం కన్నా ఈ మొత్తం చాలా పెద్దది.

  అయితే క్రితం సంవత్సరం క్రితం ఈ సంవత్సరం హిట్ పర్శంటేజ్ ఎక్కువే ఉంది. గబ్బర్ సింగ్, బిజినెస్ మ్యాన్, రచ్చ, జులాయి, సుడిగాడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ సంవత్సరం భాక్సాఫీస్ ని శాసించాయి. అంతేగాక ఈ చిత్రాలు ఓవర్ సీస్ లోనూ మంచి బిజినెస్ చేసి మార్కెట్ ని విస్తృతం చేసాయి. వీటికి తోడు ఇతర రాష్ట్రాలలోనూ ఈగ వంటి చిత్రాలు దుమ్ము దులిపాయి.

  ఇంతేగాక ఈ సంవత్సరం చిన్న సినిమాలు కూడా ఆదరణ బాగానే పొందాయి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, బస్ స్టాఫ్, ఈ రోజుల్లో వంటి చిత్రాలు మంచి కలెక్షన్స్ తెచ్చి... లో బడ్జెట్ చిత్రం అనే కాన్సెప్టుకి ఓపిరి పోసాయి.

  అయితే ఇదే వరసలో ఎంతో హైప్ క్రియేట్ చేసుకున దమ్ము, దరువు, అధినాయకుడు, ఎందుకంటే ప్రేమంట, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, దేముడు చేసిన మనుష్యులు, శ్రీమన్నారాయణ వంటి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఈ నేఫధ్యంలో 2012 లో భాక్సాఫీస్ ని నిరాశపరిచిన చిత్రాల వరస పరిశీలిస్తే...

  నందీశ్వరుడు: జనవరిలో సంక్రాంతి కానుకగా... వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ రీమేక్ చిత్రం.. ఫ్లాప్ గా మిగిలింది. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

  నిప్పు: పిబ్రవరిలో.... రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ నిప్పు చిత్రం ఆల్ టైమ్ డిజాస్టర్ టాక్ ని రిలీజైన మొదటి షో కే తెచ్చుకుంది. మరో దర్శకుడు వైవియస్ చౌదరి ఈ చిత్రానికి నిర్మాత కావటం విశేషం.

  నా ఇష్టం: మార్చిలో..... అల్లరి నరేష్ నువ్వా నేనా, ప్లాప్ టాక్ తెచ్చుకుంటే, మంచు మనోజ్.. మిస్టర్ నూకయ్య.. డిజాస్టర్ అయ్యింది. ఇక దగ్గుపాటి రానా చిత్రం నా ఇష్టం... ఆల్ టైమ్ డిజాస్టర్ అనిపించుకుంది.

  దమ్ము: ఏప్రియల్ లో.... ఎన్టీఆర్ దమ్ము చిత్రం ఫరవాలేదు అనిపించుకుంటే... తేజ చిత్రం నీకు నాకు డ్యాష్ డ్యాష్ ప్లాప్ గా నమోదైంది. ఇక ఆర్.పి పట్నాయిక్ ప్రెండ్స్ బుక్, నిఖిల్ డిస్కో చిత్రాలు వాష్ అవుట్ చిత్రాలుగా మిగిలాయి.

  దరువు: మే నెలలో.... రవితేజ, తాప్సీ కాంబినేషన్ లో వచ్చిన దరువు చిత్రం మెగా డిజాస్టర్ గా మిగిలింది. రవితేజ క్రేజ్ తో యమ లోకం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం తమిళ అతితో ప్రేక్షకులకు నరకం చూపించింది.

  అధినాయకుడు: జూన్ నెలలో... బాలకృష్ణ అధినాయకుడు, రామ్.. ఎంకుకంటే ప్రేమంట, కార్తీ శకుని చిత్రాలు డిజాస్టర్స్ గా భాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకున్నాయి. శ్రీకాంత్.. హీరోగా వచ్చిన ఆల్ ది బెస్ట్ చిత్రం ఆల్ ది వరస్ట్ గా మిగిలింది.

  ఊ కొడతారా ఉలిక్కి పడతారా: జూలై... బాలకృష్ణ గెస్ట్ రోల్ లో చేసిన ఊ.. కొడతారా ఉలిక్కి పడాతారా చిత్రం, ఎమ్.ఎస్ రాజు కొడుకుని పరిచయం చేస్తూ రూపొందిన తూనీగ తూనీగ చిత్రం రెండూ డిజాస్టర్స్ గా మిగిలాయి.

  ఆగస్టు... లో రవితేజ... దేముడు చేసిన మనుష్యులు,బాలకృష్ణ... శ్రీమన్నారాయణ పెద్ద ప్లాపులుగా మిగిలితే... అందాల రాక్షసి... ప్లాపే కానీ ఫరవాలేదు అనిపించుకుంది.

  సెప్టెంబర్ లో... నాగార్జున షిర్టీ సాయి,శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలు ప్లాప్ అనిపించుకుంటే... ప్రభాస్ రెబెల్ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

  అక్టోబర్ లో... కాంట్రావర్శీ క్రియేట్ చేసిన సారీ టీచర్, హైప్ క్రియేట్ చేసిన రాజేంద్రప్రసాద్ డ్రీమ్స్ పెద్ద ప్లాపు చిత్రాలుగా మిగిలాయి.

  నవంబర్ లో... శ్రీకాంత్ లక్కీ, ప్రవీణ్ సత్తార్ రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలు డిజాస్టర్స్ గా మారాయి. రానా కృష్ణం వందే జగద్గురం..... ప్లాప్ గా నమోదైంది.

  డిసెంబర్ లో డిజాస్టర్ చిత్రాలుగా... రవితేజ సారొచ్చారు, సాయిరాం శంకర్ యమహో యమహ చిత్రాలు నమోదు అయ్యాయి. శ్రీకాంత్ దేవరాయ, ఎటో వెళ్లిపోయింది మనస్సు ఓకే అనిపించుకున్నాయి.. కానీ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.

  English summary
  In 2012, Telugu film industry, which is the biggest industry in South India, has already released 150 movies, including 47 dubbed films. Another 10 movies, including three dubbed films are slated to hit the screens in this year. Barring dubbed versions, Tollywood has produced a total of 117 movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X