Don't Miss!
- News
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే: తాజా హెల్త్ బులిటెన్
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Ponniyin Selvan Collections: 4వ రోజు తగ్గిన కలెక్షన్లు!.. కారణం అదేనా, మొత్తంగా వచ్చింది ఎంతంటే?
రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు మణిరత్నం. ఈ స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1.కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ బాహుబలిగా అభివర్ణించారు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీగానే దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' చిత్రం 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం!

భారీ తారాగణంతో..
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్..
భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్.

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు..
నాలుగు రోజులకు 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 76 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 7.99 కోట్లు షేర్, రూ. 15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ కు వచ్చింది ఎంతంటే..
భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 7.99 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.51 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 4 రోజులకు కలిపి తెలుగులో రూ. 15 కోట్లు, తమిళంలో రూ. 85.40 కోట్లు, కర్నాటకలో రూ. 14.90 కోట్లు, కేరళలో రూ. 11.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 11.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 100.85 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 239.60 కోట్లు గ్రాస్, రూ. 123.90 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా సక్సెస్ అవ్వాలంటే?
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 123.90 కోట్ల వరకే షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 8.1 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.