పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హ్యయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన ఫిల్మ్.. ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవనుడి భక్తులు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ కోట్లల్లో ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చిత్రాలు విడుదల సమయంలో వారు ఎంత సందడి చేస్తుంటారో తెలిసిందే. ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్ THEY CALL HIM OG చిత్రంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేక్షంగా చూస్తున్నాం. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ముఖ్యంగా యూఎస్ఏలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG సౌండ్‌ను గట్టిగా వినిపిస్తూ చిత్రాన్ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

ఇదే స్థాయిలో పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా కమర్షియల్ గా హిట్ చేస్తుంటారు. సినిమా టాక్ ఎలా ఉన్నా తమ వంతుగా బాక్సాఫీస్ గల్లా పెట్టే నింపేస్తుంటారు. ఈ క్రమంలో OG సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే Pawan Kalyan OG సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రం ఏదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Powerstar Pawan Kalyan Highest Grossed film in his Career

పవన్ కళ్యాణ్ 1996 నుంచి హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 28 చిత్రాల్లో నటించారు. OG సహా ఉస్తాద్ భగత్ సింగ్ తో కలిసి 30 చిత్రాలు. ఈ రెండు చిత్రాలు కూడా వెన్వెంటనే రిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి. తొలి ప్రేమ్, తమ్ముడు, బద్రి, ఖుషి, బాలు, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు ఉన్నాయి.

అయితే వీటిలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ నిలిచింది. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లై, డైలాగ్స్ అందించడం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ రూ.75లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. కాగా బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ చిత్రం రూ.210 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు లెక్క చెప్పారు.

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు : పార్ట్ 1 కూడా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.110 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది. గతంలో ఆయా చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరిన టాప్ లో నిలవలేకపోయాయి. భీమ్లా నాయక్ మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో హ్యయెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక OG చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రూ.250 కోట్లతో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. సుజీత్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ ఫిల్మ్‌కు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X