»   » తొలిరోజు రూ.40 కోట్లు వసూలు చేసింది

తొలిరోజు రూ.40 కోట్లు వసూలు చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఈ హిందీ చిత్రం దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు సినీ వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

Prem Ratan Dhan Payo sets a new opening day record

ఈ చిత్రంలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు. చిత్రానికి భారీ స్దాయిలో ఓపినింగ్స్ వచ్చాయి. అయితే తొంభైల నాటి చిత్రంలా ఉందని బాలీవుడ్ లో విమర్శలు వస్తున్నాయి. అయితే సినిమా మాత్రం పూర్తి స్ధాయి కలర్ ఫుల్ గా ఉందని చెప్తున్నారు. రాజశ్రీ వారి హీరోయిన్ గా సోనమ్ అందంగా కనిపించినా నటనలో మాత్రం ఆ స్దాయి కనపరచలేదని చెప్తున్నారు.

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలవుతోంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొస్తున్నారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

సల్మాన్‌కు ప్రేమ్‌ పేరుతో అదృష్టం కలిసొచ్చింది. బర్జాత్యాతో చేసిన చిత్రాలతో పాటు కొన్ని ఇతర చిత్రాల్లోనూ సల్మాన్‌ పాత్రకు ప్రేమ్‌ పేరు పెట్టారు. అవి దాదాపు విజయం సాధించాయి. ఇప్పుడు 'ప్రేమ్‌ రతన్‌..'తో సల్మాన్‌ 12వ సారి ప్రేమ్‌గా కనిపించబోతున్నాడు.

English summary
Salman Khan and Sooraj Barjatya's much-awaited Diwali release, Prem Ratan Dhan Payo's Hindi version managed to collect Rs 39-40 crore nett.
Please Wait while comments are loading...