twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేది' కలెక్షన్స్ గురించి నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''తెలుగు సినీ చరిత్రలో 'మగధీర' ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. ఆ చిత్ర నిర్మాణంలో నేను భాగస్వామిని. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాకీ నేనే నిర్మాతను. ఇలా రెండు మేటి చిత్రాల్లో భాగం పంచుకొన్నందుకు ఆనందంగా ఉంది''అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. 'అత్తారింటికి దారేది' 25 రోజుల మార్కు చేరుకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు.

    బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. క్లిష్టసమయంలో పవన్‌, త్రివిక్రమ్‌లు అండగా నిలబడ్డారు. పైరసీకి గురైనా.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందా? అని అందరూ అడుగుతున్నారు. ఆ మైలు రాయిని చేరుకొనే అవకాశాలున్నాయి'' అన్నారు.

    Producer BVSN Prasad about Attarintiki Daaredi Collections

    సమంత మాట్లాడుతూ ''యాభై రోజుల్లో సాధించాల్సిన వసూళ్లు ఇరవై అయిదు రోజుల్లోనే దక్కాయి. ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇటీవల కృతజ్ఞతల సభలో పవన్‌ నన్ను మెచ్చుకొన్నారు. అదే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. పవన్‌, త్రివిక్రమ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. ఈ ముగ్గురూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది'' అని చెప్పింది.

    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    "Attarintiki Daredi" (AD) has crossed the 70-crore mark in 24 days at the worldwide box office, earning a worldwide share of 70.18 crore at the end of the fourth weekend. With this, "AD" has become the second Telugu film to have crossed the 70-crore mark, after "Magadheera." Pawan Kalyan has achieved a rare feat of having two films with a worldwide share of over 60 crore - "AD" and "Gabbar Singh" ( 60.6 crore).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X