Just In
- 20 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 45 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 50 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 56 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారీ వసూళ్లు రాబడుతున్న డర్టీ హరి.. కలెక్షన్ డోస్ తగ్గేలా లేదుగా
ఇటీవల కాలంలో కొన్ని బోల్డ్ సినిమాలు క్రియేట్ చేస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. అవకాశం వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. కొన్ని సినిమలైతే ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ తోనే యూత్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా అలాంటి తరహాలోనే డర్టీ హరి సినిమా బాగా వైరల్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా అందిస్తున్న లాభాలు అన్ని ఇన్ని కావు నిర్మాత ఒక్కసారిగా సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు.

ఆ సినిమా తరువాత.. భారీ నష్టాలు
దేవి, ఒక్కడు, వర్షం వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్ఎస్.రాజు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అప్పట్లో ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేవి. అయితే పౌర్ణమి సినిమా తరువాత వరుసగా కొన్ని సినిమాలు కోలుకోలేని విధంగా నష్టాలను కలిగించాయి.

కొడుకు సినిమా కూడా ప్లాప్
ముఖ్యంగా ఆయన తనయుడైన అశ్విన్ ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం తూనీగ తూనీగ. ఆయనే సొంతంగా కూడా డైరెక్ట్ చేశారు. అయితే అనుకోకుండా ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఆ దెబ్బతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ చాలా కాలం పాటు వెండితెరపై కనిపించలేదు.

డర్టీ హరి.. బాగానే వర్కౌట్ అయ్యింది
సరిగ్గా 8 ఏళ్ళ అనంతరం ఎమ్ఎస్.రాజు కాస్త డిఫరెంట్ స్టైల్ లో ప్రయోగాత్మక సినిమాతో యూత్ ను టార్గెట్ చేశాడు. మందుకొడుతూ సినిమా చూడవచ్చని పదునైన స్టేట్మెంట్స్ తో డర్టీ హరిని ప్రమోట్ చేశాడు. ఆ సినిమాను మొదట ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదల చేశారు. సినిమాలోని బోల్డ్ కంటెంట్ ఓ వర్గం ఆడియెన్స్ ను గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది.

సంక్రాంతి ఫైట్ లో కూడా
మొదట 120రూపాయలతో స్ట్రీమింగ్ పెట్టగా దాదాపు 90వేలకు పైగా వ్యూవ్స్ లభించినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇది భారీ లాభమనే చెప్పాలి. అంటే దాదాపు కోటికి పైగా కలెక్షన్స్ అందుకుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆహాతో డీలింగ్ సెట్ చేసుకొని అందులో రిలీజ్ చేశారు. ఇక డర్టీ హరిని ఈ నెల 8న డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సంక్రాంతి సీజన్ లో జనాలు కాస్త ఎట్రాక్ట్ అయినా కూడా నిర్మాతకు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి డర్టీ హరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.