»   » ‘పులి’...భారీగా పడిపోయిన ఓపెనింగ్స్!

‘పులి’...భారీగా పడిపోయిన ఓపెనింగ్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: తమిళ స్టార్ విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘పులి'. శ్రీదేవి ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్ సుదీప్ కూడా ముఖ్య పాత్రలో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదల కావాల్సిన ఈ సినిమా పలు ఫైనాన్షియల్ సమస్యలతో ఆలస్యం అయింది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలో రద్దయ్యాయి. తమిళ నాడులో మధ్యాహ్నం నుండే సినిమాలు ప్రదర్శితం అయ్యాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసారు.


 Puli openings dropped

అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు, హిందీలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాక తొలి రోజు పలు షోలు రద్దయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ‘పులి' సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వస్తాయని వేసిన అంచనాలు తలక్రిందులు అయ్యాయి. దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ పడిపోయాయి.


శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.

English summary
With all the shows for the day cancelled, the Vijay starrer, Puli missed out on some lucrative openings in both the Telugu states today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu