»   »  'పులి': తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

'పులి': తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

Written By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ వారమే విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ విషయమై ఆసక్తికరమైన చర్చ అంతటా మొదలైంది. ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రాఫిట్ బుల్ వెంచరే అంటున్నారు.

puli1

ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ఎస్ వి ఆర్ మీడియా వారు ఎనిమిది కోట్లకు తీసుకున్నారు. వీరు నైజాం ఏరియాను స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. కోస్టల్ ఆంధ్రా ఏరియాకు 3 కోట్లు, సీడెడ్ కోటి డబ్బై ఐదు లక్షలుకు అమ్మినట్లు సమాచారం. అంతేకాక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్ముడైతే అందులో సగం ఈ ఎనిమిది కోట్ల ప్యాకేజ్ లో వచ్చింది. దాంతో నైజాం లో వచ్చే రెవిన్యూ మొత్తం మిగులే అంటున్నారు. అది భారీగానే ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు.

దాంతో సినిమా ఎనిమిది నుంచి పది కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్లే అని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారికి బాగా పరిచయమైన హన్సిక, శృతిహాసన్, సుదీప్, శ్రీదేవి, అలీ ఉండటం,సోషియో ఫాంటసీ కావటంతో ఓపినింగ్స్ కూడా బాగుంటాయని భావిస్తున్నారు. పిల్లలను కూడా ఎట్రాక్ట్ చేసేలా ప్రోమోలు కట్ చేయటం మరో ప్లస్ పాయింట్.

puli

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో శ్రీదేవి కీలక పాత్ర పోషించినందున హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఎక్కువ హిట్లతో దూసుకెళ్తోంది.

మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఈ ట్రైలర్‌ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన 'కిక్‌ 2' అధిక హిట్లతో తొలి స్థానంలో ఉంది. ఆ రికార్డును 'పులి' ట్రైలర్‌ శుక్రవారం బ్రేక్‌ చేసింది. కిక్‌-2 ట్రైలర్‌కు 1,01,855 హిట్లు ఉండగా... 'పులి' ట్రైలర్‌కు 1,01,968 హిట్లు వచ్చాయి.

ఈ చిత్రం కథని శింబు దేవన్ రాసారు. పులి చిత్రం యాక్షన్ ఎడ్వెంచర్ ఫాంటసీ గా సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ కథ పురాతన కాలంలోనూ, ఇప్పటి మోడ్రన్ ప్రపంచంలోనూ జరుగుతుంది.

r u ready

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.
English summary
While SVR Media wishes to release 'Puli' film in Nizam on its own, Coastal Andhra Rights have fetched Rs 3 crore and Ceeded has been bought for Rs 1.75 crore.
Please Wait while comments are loading...