»   »  'లోఫర్‌' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ...దారుణం

'లోఫర్‌' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ...దారుణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్‌' చిత్రం డిసెంబర్ 17న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓకే టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా చాలా పూర్ గా ఉంది. కేవలం మొదటి వారాంతంలో ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాలలోనూ 7.55 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. భారీగా విడుదల అయిన ఈ చిత్రం ఇంత త్వరగా డ్రాప్ అయ్యి కలెక్షన్స్ పడిపోతాయని ఊహించలేదు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 8.45 కోట్లు సాధించింది. ఇది ట్రైడ్ వర్గాల లెక్కల ప్రకారం చాలా పూర్ కలెక్షన్స్. ఇక యుస్ లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నమోదు అయ్యింది. $32,000 మాత్రమే మొదటి వారాంతంలో 32 లొకేషన్స్ లో సాధించగలిగింది. క్రిసమస్ కు విడుదల అయ్యే సినిమాల రిజల్ట్ లను బట్టి ఈ చిత్రం ఓవరాల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.


Puri Jagannath's Loafer First Weekend Collections


అయితే వరుణ్ తేజకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అతనిలోని కమర్షియల్ యాంగిల్ ని పూరి బయిటకు లాగాడంటున్నారు. ముఖ్యంగా మదర్‌ సాంగ్‌లో అద్భుతంగా నటించాడు. ఇటీవల చిరంజీవిని వీడియో క్లిప్‌ చూసి, 'వరుణ్‌ ఇంత బాగా చేశాడా' అని పది నిమిషాల పాటు మాట్లాడారు. ఇక తల్లీదండ్రులుగా పోసాని, రేవతి అదరగొట్టారు. మంచి తల్లి, చెడ్డ తండ్రి మధ్య వచ్చే క్లాష్‌ ఆసక్తికరంగా ఉంది.


వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ,


అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
'Loafer' managed is a share of Rs 7.55 crore in Telugu states and Rs 8.45 crore Worldwide in its opening Weekend.
Please Wait while comments are loading...