Radhe Shyam: ప్రభాస్ సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్.. సల్మాన్ 'రాధే' కంటే ఎక్కువ అంటూ..

పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఎవరైనా సరే షాక్ ఇవ్వాల్సిందే. బాలీవుడ్ బడా హీరోలను సైతం పక్కన పెడుతున్న కొంతమంది అగ్ర దర్శకులు ఇప్పుడు ప్రభాస్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల మార్కెట్ ఇప్పుడు మామూలుగా లేదు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ ఎంత ఉందంటే సల్మాన్ ఖాన్ రాధే కంటే ఎక్కువని తెలుస్తోంది.

రిజెక్ట్ చేసిన తరువాత కూడా

రిజెక్ట్ చేసిన తరువాత కూడా

డార్లింగ్ కూడా ఎవరిని నొప్పించకుండా స్టోరీలు చెప్పడానికి వస్తున్న దర్శకులతో ముందుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడట. కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా ఇది బాగాలేదని చెబుతున్నాడట. రిజెక్ట్ చేసిన తరువాత కూడా మరొక కథ ఏదైనా ఉంటే చెప్పాలని సలహాలు కూడా ఇస్తున్నాడట.

కనీసం అప్డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని

కనీసం అప్డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని

ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ తదుపరి సినిమా రాధేశ్యామ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సినిమా విషయంలో నెమ్మదిగానే అడుగులు వేస్తోంది. అనుకున్నట్లుగా కనీసం అప్డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా రావడం అనుమానమే..

సినిమా రావడం అనుమానమే..

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాధా అనేది అనుమానంగా మారింది. సినిమాను జూలై 30న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కరోనా వలన వాయిదా పడే ఛాన్స్ ఉంది.

అమెజాన్ భారీ ఆఫర్

అమెజాన్ భారీ ఆఫర్

ఇక సినిమాకు భారీగా ఓటీటీ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఊహించని రేటుతో యూవీ క్రియేషన్స్ ను టెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాధే సినిమాను జీ సంస్థ 250కోట్లకు పైగా ఖర్చు చేసి ఓటీటీ హక్కులను దక్కించుకుంది. పైగా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేశారు. ఇక ప్రభాస్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆఫర్ దక్కినట్లు సమాచారం.

Recommended Video

Tollywood హీరో పై Prashant Neel ఫోకస్ | NTR 31 | Salaar | KGF Chapter 2 || Filmibeat Telugu
400కోట్లు.. టెంప్ట్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్

400కోట్లు.. టెంప్ట్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్

ఏకంగా 400కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. గతంలో కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ కూడా 300కోట్లు చెల్లించాడానికి సిద్ధమైనప్పటికి యూవీ సంస్థ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు అమెజాన్ బడ్జెట్ కంటే డబుల్ ప్రైజ్ ను ఆఫర్ చేయడంతో టెంప్ట్ అయ్యేలా ఉన్నారని టాక్ వస్తోంది. చిత్ర యూనిట్ మొత్తం అయితే సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిర్మాతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X